logo

రాష్ట్ర అవతరణ వేడుకలకు.. పటిష్ఠ ఏర్పాట్లు

జూన్‌ 2న కిలావరంగల్‌లోని ఖుష్‌మహల్‌ వద్ద జరిగే రాష్ట్ర అవతరణ వేడుకలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని జిల్లా పాలనాధికారి బి.గోపి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర అవతరణ ఏర్పాట్లపై గురువారం జిల్లా కలెక్టరేట్‌ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో

Published : 27 May 2022 03:25 IST

ఖుష్‌మహల్‌ వద్ద స్థల పరిశీలన చేస్తున్న ఎమ్మెల్యే నరేందర్‌, కలెక్టర్‌ గోపి, డీసీపీ వెంకటలక్ష్మి, తదితరులు

వరంగల్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జూన్‌ 2న కిలావరంగల్‌లోని ఖుష్‌మహల్‌ వద్ద జరిగే రాష్ట్ర అవతరణ వేడుకలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని జిల్లా పాలనాధికారి బి.గోపి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర అవతరణ ఏర్పాట్లపై గురువారం జిల్లా కలెక్టరేట్‌ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వేడుకలు జరిగే చుట్టుపక్కల ప్రాంతాన్ని శుభ్రపరిచి, అమరవీరుల స్థూపాన్ని పూలతో అలకరించాలని మున్సిపల్‌ అధికారులకు సూచించారు. జాతీయ పతాకానికి గౌరవ వందనం, బారికేడింగ్‌, ట్రాఫిక్‌ కంట్రోల్‌ బాధ్యతలను పోలీస్‌శాఖ సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. వేడుకల వేదిక వద్ద వైద్య సిబ్బంది, విద్యుత్‌ సరఫరా, సౌండ్‌ సిస్టం ఏర్పాట్లకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని, శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు హరిసింగ్‌, శ్రీవత్స, ఆర్డీవోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

వరంగల్‌ ఖ్యాతి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేయాలి
ఖిలావరంగల్‌, న్యూస్‌టుడే: వరంగల్‌ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఖిలావరంగల్‌కోట ప్రాంతంలో నిర్వహించేందుకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, కలెక్టర్‌ గోపి, ఈస్ట్‌ జోన్‌ డీసీపీ వెంకటలక్ష్మి, వరంగల్‌, మామునూరు ఏసీపీలు గిరికుమార్‌, నరేష్‌కుమార్‌లు స్థల పరిశీలన చేశారు. మధ్యకోట ఖుష్‌మహల్‌ పక్కన వేడుకలు నిర్వహించేందుకు ప్రతిపాదనలు చేశారు. జిల్లాల విభజన అనంతరం మొదటిసారిగా కాకతీయుల కళావైభవం, వరంగల్‌ ఖ్యాతి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచనలు చేశారు. ఆర్డీవో మహేందర్‌జీ, తహసీల్దార్‌ ఫణికుమార్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని