logo

ప్చ్‌.. 45 శాతమే!!

 గ్రామీణాభివృద్ధి శాఖ ఏటా లక్ష్యాన్ని నిర్దేశించుకుని స్వయం సహాయక సంఘాలకు తక్కువ వడ్డీకి రుణాలు అందించాలి. కానీ క్షేత్రస్థాయిలో అమలు అంతంతమాత్రంగా ఉంది. 2022-23లో ఉమ్మడి

Published : 29 Sep 2022 02:03 IST

మహిళా సంఘాలకు నెమ్మదిగా రుణాల పంపిణీ

భూపాలపల్లిలో సమావేశమైన స్వయం సహాయక సంఘాల సభ్యులు (పాత చిత్రం)

భూపాలపల్లి కలెక్టరేట్‌, భూపాలపల్లి టౌన్‌, న్యూస్‌టుడే:  గ్రామీణాభివృద్ధి శాఖ ఏటా లక్ష్యాన్ని నిర్దేశించుకుని స్వయం సహాయక సంఘాలకు తక్కువ వడ్డీకి రుణాలు అందించాలి. కానీ క్షేత్రస్థాయిలో అమలు అంతంతమాత్రంగా ఉంది. 2022-23లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రుణాల పంపిణీ పరిశీలిస్తే బ్యాంకు లింకేజీ 45 శాతం, స్త్రీనిధి ద్వారా అందించే రుణాలు 30 శాతం లోపు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మరో ఆరు నెలల్లో ముగుస్తుంది. ఈలోపు వందశాతం లక్ష్యం పూర్తయ్యేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఆర్థికంగా ఎదగడానికి ఎంతో ఉపయోగం: తక్కువ వడ్డీకి అందించే రుణాలతో మహిళలు ఆర్థికంగా ఎదిగి బలోపేతం కావచ్చు. కిరాణం, టైలరింగ్‌, దుస్తుల విక్రయ కేంద్రం, వ్యవసాయం, పాడి పశువుల పెంపకం తదితర యూనిట్లు నెలకొల్పేందుకు దోహదపడతాయి. ఒక్కో సంఘానికి.. అర్హతలను బట్టి రూ 50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణం ఇచ్చే అవకాశం ఉంటుంది. సకాలంలో రుణాలు చెల్లిస్తే వారు కట్టిన వడ్డీని మాఫీ చేసి.. తిరిగి చెల్లిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని