logo

మహిళలకు అండగా సఖి

బాధిత మహిళలకు సఖి కేంద్రం భరోసా కల్పిస్తోంది. వందల మందిని చేరదీసి  సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటోంది.

Published : 02 Dec 2022 04:53 IST

న్యూస్‌టుడే, ములుగు  

బాధిత మహిళలకు సఖి కేంద్రం భరోసా కల్పిస్తోంది. వందల మందిని చేరదీసి  సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటోంది. గ్రామాల్లో అవగాహన సమావేశాలు ఏర్పాటు చేసి చైతన్యం కలిగిస్తోంది. సమస్యలకు అనుగుణంగా ప్రత్యేక నిపుణులతో  కౌన్సెలింగ్‌ నిర్వహిస్తూ ధైర్యం నింపుతోంది. జిల్లా కేంద్రంలో రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన సఖి కేంద్రం సత్ఫలితాలు సాధిస్తోంది.

మహిళలకు అవగాహన కల్పిస్తున్న కౌన్సెలర్లు (పాతచిత్రం)

మహిళలు, బాలికలు నిత్యం ఏదో ఒక సమస్యతో సతమతమవుతుంటారు. ఎవరికీ చెప్పుకోలేక మదన పడుతుంటారు. ప్రధానంగా గృహహింస, వరకట్న, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, దత్తత, మోసపోవడం, ప్రేమ వివాహాల సమస్యలు, వయో వృద్ధులు, ఆస్తి తగాదాలు తదితర సమస్యలు స్త్రీలకు ఎదురవుతున్నాయి. బాల్య వివాహాల పట్ల అవగాహన కల్పిస్తున్నప్పటికీ గ్రామాల్లో ఇంకా పురాతన పద్ధతులు అవలంభిస్తున్నారు. అలాంటి వారికి సఖి కేంద్రం అండగా నిలుస్తోంది. జిల్లాలో మార్చి 2020 నుంచి 2022 అక్టోబర్‌ 31 వరకు అనేక సమస్యలు పరిష్కరించారు. సమస్య తెలియగానే తక్షణమే స్పందించి వారి వద్దకు చేరుకొని పరిష్కారానికి మార్గాలను చూపుతున్నారు. అవసరమైతే పోలీసుల సహాయం తీసుకుంటున్నారు. ఇరు వర్గాలను సమన్వయ పర్చి కౌన్సెలింగ్‌ ఇచ్చి రాజీ కుదుర్చుతున్నారు.

ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నంబర్‌

మహిళలు, బాలికలకు సమస్య తలెత్తినప్పుడు సంప్రదించేందుకు ప్రత్యేకంగా 181 హెల్ప్‌లైన్‌ నెంబరు ఏర్పాటు చేశారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సఖి, ఛైల్డ్‌లైన్‌ ప్రతినిధులు విస్తృతంగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. గృహ హింస, వరకట్నం, పని చేసే చోట, లైంగిక వేధింపులు, ఆడపిల్లల అమ్మకాలు, రవాణా, నివారణ, సలహాలు, రక్షణ మొదలగు అంశాలపై ఈ నెంబర్‌ను సద్వినియోగం చేసుకునే విధంగా అవగాహన కల్పిస్తున్నారు.


పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం

ప్రేమలత, జిల్లా సంక్షేమాధికారి

మహిళలు, బాలికల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. మహిళల్లో వారి జీవన విధానంలో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయనే వాటిపై కూడా వారికి అవగాహన కల్పిస్తున్నాం. సఖి కేంద్రాన్ని సంప్రదించినప్పుడు ఇరు వర్గాలతో సమావేశం ఏర్పాటు చేసి కౌన్సెలింగ్‌ నిర్వహించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని