వైద్య పరిశోధనలకు పెద్దపీట
వైద్య రంగంలో ఎప్పటికప్పుడు కొత్త పరిజ్ఞానం అందుబాటులోకి వస్తోంది. ఒకప్పుడు వైద్య విద్యార్థులు ఏ ప్రయోగం చేయాలన్నా రోగుల మీదే ఉండేది.
కేఎంసీలో అత్యాధునిక ప్రయోగశాలలు
కేఎంసీ అకడమిక్ బ్లాక్‌లోని నైపుణ్య కేంద్రం
వైద్య రంగంలో ఎప్పటికప్పుడు కొత్త పరిజ్ఞానం అందుబాటులోకి వస్తోంది. ఒకప్పుడు వైద్య విద్యార్థులు ఏ ప్రయోగం చేయాలన్నా రోగుల మీదే ఉండేది. మారిన సాంకేతికతతో మొదట వైద్య పరికరాలపై ప్రయోగాలు చేసి పూర్తి శిక్షితులయ్యాకే మనుషులకు చికిత్స చేసే పరిజ్ఞానం వస్తోంది. ఈ నేపథ్యంలో వైద్య విద్యార్థుల నైపుణ్యాలు మరింత పెంపొందించేందుకు వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో మూడు కొత్త ప్రయోగశాలలు అందుబాటులోకి వస్తున్నాయి.
ఈనాడు, వరంగల్, ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే
బొమ్మలతో సీపీఆర్‌పై శిక్షణ
కొన్ని సందర్భాల్లో ఉన్నపళంగా మనుషులు కుప్పకూలిపోతారు. ఇలా సడన్ కార్డియాక్ అరెస్టు సంభవించినప్పుడు సీపీఆర్.. (కార్డియో పల్మనరీ రిసిటేషన్) ఛాతిపై వేగంగా రెండు హస్తాలతో బాదే ప్రక్రియ చేస్తే ఆ వ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కేఎంసీలోని అకాడమిక్ బ్లాక్‌లో జాతీయ వైద్య మండలి నిధులతో ఏర్పాటుచేస్తున్న నైపుణ్య కేంద్రం ఇప్పటికే సిద్ధమైంది. ఇందులో కేఎంసీ వైద్య విద్యార్థులకు మనిషి ఆకారంలా ఉండే బొమ్మల (మానికిన్)తో సీపీఆర్‌పై శిక్షణ ఇవ్వనున్నారు. దీంతోపాటు వైద్యశాలలో రోగులకు చేసే అనేక రకాల చికిత్సలు చేసేందుకు వైద్య పరికరాలపై తర్ఫీదు ఉంటుంది. ఈ ప్రయోగశాల కోసం కావాల్సిన గదులు, సమావేశ మందిరాలు సిద్ధమయ్యాయి. సకల ఆధునిక హంగులతో ఇది ముస్తాబైంది.
ఇతర కళాశాలల వారికి
అకాడమిక్ బ్లాకులోనే మరో ప్రయోగశాల సిద్ధమవుతోంది. నేషనల్ ఎనర్జీ లైఫ్ సపోర్ట్ (ఎన్‌ఈఎల్‌ఎస్) పేరుతో కేంద్ర ప్రభుత్వం దీన్ని మంజూరు చేసింది. ఏర్పాటుకు రూ.1.5 కోట్లు మంజూరయ్యాయి. ఇందులోనూ వైద్య విద్యార్థులకు నైపుణ్యాలు పెంచే పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇది ప్రాంతీయ పరిశోధన ప్రయోగశాలగా సేవలు అందించనుంది. ఈ ప్రయోగశాలలో ఇతర కళాశాలల విద్యార్థులకు కూడా నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చేందుకు వీలుంది. ఈ ప్రయోగశాలతోపాటు ఎన్‌ఆర్‌ఐ ఆడిటోరియం వద్ద మరో ల్యాబ్ రానుంది. ఈ ల్యాబ్ ఏర్పాటుకు కేఎంసీ ఎన్‌ఆర్‌ఐ పూర్వ విద్యార్థులు రూ.80 లక్షల వరకు విరాళం ఇస్తున్నారు. ప్రతి పీజీ విద్యార్థి పరీక్ష రాసే ముందు ఒక పరిశోధన పత్రం జర్నళ్లలో ప్రచురితం కావాలి. వారు వైద్య రంగంలో కొత్త పరిశోధనలు చేసేందుకు కూడా ఇక్కడ సౌకర్యాలు ఉంటాయి. ఈ ప్రయోగశాలలు రావడం వల్ల వైద్య విద్యార్థుల పరిశోధనలకు ఊతమివ్వడమే కాకుండా, కొత్తగా 10 పోస్టులు రానున్నాయి. ఇందులో 5 సైంటిస్టు పోస్టుల వరకు ఉండనున్నాయి. ఈ రెండు ప్రయోగశాలలను త్వరలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చేతులమీదుగా ప్రారంభించే అవకాశం ఉంది.
ఎంతో ఉపయుక్తం: - డాక్టర్ మోహన్‌దాస్, ప్రిన్సిపల్, కేఎంసీ
కొత్తగా మూడు ప్రయోగశాలలు కేఎంసీ ఆవరణలో సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అకాడమిక్ బ్లాక్‌లో స్కిల్ సెంటర్ సిద్ధమైంది. దీన్ని జాతీయ వైద్య మండలి ఏర్పాటుచేస్తోంది. వైద్య పరికరాలు కూడా వచ్చాయి. విద్యార్థులు ఆధునిక వైద్య పరికరాలతో ల్యాబ్‌లలో కొత్త నైపుణ్యాలు పెంపొందించేందుకు వీలు కలగనుంది. త్వరలో వీటిని ప్రారంభిస్తాం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Tamilisai soundararajan: శ్రీరాముడి పట్టాభిషేకానికి రైలులో భద్రాచలానికి బయలుదేరిన గవర్నర్
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (31/03/2023)
-
World News
African:ఆఫ్రికాలో కొత్త వైరస్.. ముక్కు నుంచి రక్తస్రావమైన 24 గంటల్లోనే ముగ్గురి మృతి
-
India News
Rajasthan: ‘గహ్లోత్‌జీ వారి మొర ఆలకించండి’.. ప్రైవేట్ వైద్యులకు సచిన్ పైలట్ మద్దతు!
-
Sports News
IND vs PAK: వన్డే ప్రపంచ కప్ 2023.. భారత్‌లో ఆడేది లేదన్న పాక్.. తటస్థ వేదికల్లోనే నిర్వహించాలట!
-
Crime News
Robbery: సినిమాలో చూసి.. రూ.47 లక్షలు కాజేసి..!