logo

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

విద్యార్థులకు ఇంటర్మీడియట్‌ దశ ఎంతో కీలకమని, సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నిట్‌ వరంగల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.వి.రమణారావు పిలుపునిచ్చారు.

Published : 06 Feb 2023 04:10 IST

బహుమతులందుకున్న వారితో వరదారెడ్డి, ఎన్‌.వి.రమణారావు, తిరుపతిరెడ్డి తదితరులు

హసన్‌పర్తి, న్యూస్‌టుడే: విద్యార్థులకు ఇంటర్మీడియట్‌ దశ ఎంతో కీలకమని, సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నిట్‌ వరంగల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.వి.రమణారావు పిలుపునిచ్చారు. ఆదివారం హసన్‌పర్తి మండలం పెంబర్తిలోని ఏకశిల విద్యా సంస్థలో జూనియర్‌ కళాశాలల వార్షికోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త విషయాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఎస్సార్‌ విద్యా సంస్థల ఛైర్మన్‌ ఎనగందుల వరదారెడ్డి, ఏకశిల విద్యా సంస్థల ఛైర్మన్‌ గౌరు తిరుపతిరెడ్డి, డైరెక్టర్లు బేతి కొండల్‌రెడ్డి, గౌరు సువిజారెడ్డి, ముచ్చ జితేందర్‌రెడ్డి, ప్రిన్సిపల్స్‌ ఇ.తిరుపతిరెడ్డి, జి.సుధాకర్‌రెడ్డి, ఎస్‌.రాజిరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని