logo

వేగవంతంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు

మహదేవపూర్‌ మండలంలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా ఆదేశించారు.

Published : 29 Mar 2024 05:56 IST

భూపాలపల్లి కలెక్టరేట్‌  : మహదేవపూర్‌ మండలంలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా ఆదేశించారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయంలో రెవెన్యూ, నీటిపారుదల, విద్యుత్తు, మెగా కంపెనీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. బీరాసాగర్‌ వద్ద గోదావరి నుంచి చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు నీటిని తరలించేందుకు అప్రోచ్‌ కాల్వల నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని మందిరం చెరువు, ఎర్ర చెరువు నుంచి కొత్తచెరువు, గారేపెల్లి చెరువు, ఎల్లాపూర్‌, పోలారం తదితర చెరువులకు సరఫరా చేస్తూ.. 45 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని పేర్కొన్నారు. బీరాసాగర్‌ వద్ద నిర్మించిన పంప్‌హౌస్‌కు గోదావరి నీటిని రెండు నెలల్లో మళ్లించడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. భూ సేకరణ పనులు సకాలంలో పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, నీటిపారుదల ఈఈలు యాదగిరి, తిరుపతి, విద్యుత్తు శాఖ ఎస్‌ఈ మల్చూర్‌నాయక్‌, ఆర్డీవో మంగిలాల్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని