logo

మరోసారి కాంగ్రెస్‌ సత్తా చాటాలి

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్‌ను అధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Published : 29 Mar 2024 05:58 IST

నూతన దంపతులతో మంత్రి సీతక్క

ఏటూరునాగారం, న్యూస్‌టుడే: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్‌ను అధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పట్టుదలతో పని చేయాలన్నారు. ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన పీఏసీఎస్‌ ఉపాధ్యక్షుడు చెన్నూరి బాలరాజు, లక్ష్మి దంపతుల కూతురు శశిత(శ్రీజ), అదే గ్రామానికి చెందిన పెరుమాండ్ల రాణి-లక్ష్మీనారాయణ దంపతుల కుమారుడు నాగరాజు వివాహానికి మంత్రి హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం ఏటూరునాగారంలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి మంత్రి మాట్లాడారు. మాజీ మంత్రి బలరాంనాయక్‌ను గెలిపించి మరోసారి సత్తా చాటాలన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా, బ్లాక్‌, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


భిక్షంరెడ్డి సేవలు మరువలేనివి

గోవిందరావుపేట: మండలంలోని లక్నవరం గ్రామానికి చెందిన సీపీఎం నాయకుడు భిక్షంరెడ్డి అనారోగ్యంతో బుధవారం మృతి చెందగా గురువారం ఆయన కుటుంబ సభ్యులను సీతక్క పరామర్శించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. భిక్షంరెడ్డి ఆలోచనలు ఎప్పుడూ నిరుపేదల చుట్టూ తిరుగుతుండేవని,  నిజాయతీగా, నిరాడంబరుడిగా ఆయన జీవించిన తీరు పలువురికి ఆదర్శప్రాయమని, ఆయన సేవలు మరువలేనివన్నారు. కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్‌, మండలాధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ, నాయకులు ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని