logo

పీఆర్‌సీపైనిరసన

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ప్రకటించిన 11వ పీఆర్‌సీపై ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ‘ఫ్యాప్టో’ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు. స్థానిక సీఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల ఎదుట భోగి మంటలో సీఎస్‌ నివేదిక ప్రతులను వేసి కాల్చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ హాజరై మాట్లాడుతూ 11వ పే

Published : 15 Jan 2022 01:41 IST

సీఎస్‌ నివేదిక ప్రతులను భోగి మంటలో వేస్తున్న ఎమ్మెల్సీ సాబ్జీ

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ప్రకటించిన 11వ పీఆర్‌సీపై ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ‘ఫ్యాప్టో’ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు. స్థానిక సీఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల ఎదుట భోగి మంటలో సీఎస్‌ నివేదిక ప్రతులను వేసి కాల్చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ హాజరై మాట్లాడుతూ 11వ పే రివిజన్‌ కమిషన్‌ నివేదికను బహిర్గతం చేయకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ నివేదిక ప్రాతిపదికగా ఏకపక్షంగా ఫిట్‌మెంట్‌ ప్రకటించడంతో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి నెలకొందన్నారు. ఇంటి అద్దెల అలవెన్సుల స్లాబులను మార్చకుండా పాత వాటినే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. 30 శాతానికి తగ్గకుండా ఫిట్‌మెంట్‌ ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బీఏ సాల్మన్‌రాజు, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రవికుమార్‌, ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు నారాయణ, ఏపీటీఎఫ్‌-1938 జిల్లా అధ్యక్షుడు జి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని