logo

నామినేషన్‌ అని.. నానా తిప్పలు పెట్టారు

ఉంగుటూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) గురువారం నామినేషన్‌ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Published : 26 Apr 2024 04:09 IST

జాతీయ రహదారిపై నిలిచిన రాకపోకలు

ఉంగుటూరు, న్యూస్‌టుడే: ఉంగుటూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) గురువారం నామినేషన్‌ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ నిలిచింది. ప్రైవేటు అంబులెన్స్‌ కొద్దిసేపు ఆగిపోయింది. బల నిరూపణకు వైకాపా నాయకులు భారీగానే ఖర్చు చేశారని తెలుస్తోంది. పురుషులకు రూ.400 నుంచి రూ.500, మహిళలకు రూ.300 నుంచి రూ.400 పంపిణీ చేసినట్లు సమాచారం. ఉపాధి హామీ కూలీలు, డ్వాక్రా సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి రప్పించారు. ప్రైవేటు పాఠశాలల బస్సులు, ఆటోల్లో తరలించారు. జంగారెడ్డిగూడెం నుంచి భీమవరం వెళ్లే ఆర్టీసీ బస్సులను పోలీసులు నారాయణపురం వద్ద జాతీయ రహదారిపై నిలిపివేశారు. ప్రయాణికులు గంటల తరబడి  నిరీక్షించాల్సి వచ్చింది. జాతీయ రహదారిపై ఆ పార్టీ కార్యకర్తలు నృత్యాలు చేయడంతో  రాకపోకలకు ఆటంకం కలిగింది. ఉంగుటూరులో  సర్వీసు రోడ్డుపై టెంట్లు వేసి జనాలను కూర్చోబెట్టారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే సమయంలో వైకాపా కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వాసుబాబు, జగన్‌ ఫొటోలున్న మంచి నీళ్ల సీసాలను పంపిణీ చేశారు. గణపవరం  రహదారిపై కూడా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన అంబులెన్సు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు