logo

జగన్‌ రక్త చరిత్ర దాగనిది: ఎంపీ రఘురామ

‘జగన్‌ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని..

Published : 26 Apr 2024 03:52 IST

ఈనాడు డిజిటల్‌, భీమవరం, కాళ్ల, న్యూస్‌టుడే: ‘జగన్‌ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని.. రాయలసీమలోనూ అత్యధిక సీట్లు సాధిస్తుందని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ‘రచ్చబండ’ కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా పెదఅమిరంలోని తన కార్యాలయంలో ఆయన గురువారం మాట్లాడారు. ‘మీ కుటుంబానికి న్యాయం జరిగిందంటేనే ఓట్లు వేయాలని, లేదంటే వద్దని చెబుతున్న జగన్‌రెడ్డి తన సొంత కుటుంబంలోనే హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. ఆయన రక్తచరిత్ర ఎంత దాయాలనుకున్నా దాగదు. వైకాపా అభ్యర్థులంతా మంచివారు, సౌమ్యులని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది’ అని వివరించారు.

నాపై పోటీకి స్వతంత్ర అభ్యర్థిపై ఒత్తిడి.. ఉండి నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి ఉన్నా స్వతంత్ర అభ్యర్థిని ప్రోత్సహించడం వెనుక ఉన్న కుట్రను ప్రజలు అర్థం చేసుకోవాలి. తెదేపా రెబల్‌ ముసుగులో వైకాపాతో కలిసి తిరిగితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. నేను అభ్యర్థి కావడం వల్లే స్వతంత్ర అభ్యర్థి శివరామరాజు పోటీలో కొనసాగాలని వైకాపా ఒత్తిడి తెచ్చింది. అందుకే ఆయన శిబిరంలో వైకాపా కార్యకర్తలు ఎక్కువగా కనిపిస్తున్నారు, ఓట్లు చీలతాయని భావించినా.. చివరకు నాకు మేలే జరుగుతుంది’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని