logo

రోజూ వేదనే

ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చిన గర్భిణులు, బాలింతల సహాయకులు వీరు.

Published : 26 Apr 2024 04:00 IST

మాతా శిశు విభాగంలో వరండాలో సామగ్రిని ఉంచిన సహాయకులు

ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చిన గర్భిణులు, బాలింతల సహాయకులు వీరు. వీరితో పాటు వివిధ విభాగాల్లో ఉన్న రోగులకు సహాయకులుగా నిత్యం సగటున 5 వందల మంది వరకు వస్తుంటారు.  నిలువ నీడ లేక.. ఎక్కడ తల దాచుకోవాలో తెలియక మెట్ల కింద, వరండాల్లో, ఆరుబయట చెట్ల కింద నిరీక్షిస్తున్నారు. వీరికి వసతి ఏర్పాటుచేయాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వైకాపా ప్రభుత్వం గడిచిన అయిదేళ్లలో వీరి కష్టాలు తీర్చలేదు. రోగులకు ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో, ఎప్పుడు పిలుస్తారోనని పగలూ, రాత్రి ఇలా నిరీక్షిస్తున్నారు. 

ఈనాడు, ఏలూరు

వరండాలో నిరీక్షిస్తూ..

 మెట్ల కింద సహాయకుల పడిగాపులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని