logo

జగన్‌ మావయ్యా.. ఇటు చూడయ్యా!

విద్యార్థులకు ఏ కష్టం రాకుండా సొంత మేనమామలా చూసుకుంటామని సభల్లో పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్‌ మాటలకు.. క్షేత్రస్థాయిలో బాలబాలికలు  ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన కుదరడం లేదు.

Updated : 26 Apr 2024 05:03 IST

మరుగుదొడ్ల ముందు ఇలా...

విద్యార్థులకు ఏ కష్టం రాకుండా సొంత మేనమామలా చూసుకుంటామని సభల్లో పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్‌ మాటలకు.. క్షేత్రస్థాయిలో బాలబాలికలు  ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన కుదరడం లేదు. ఏలూరు జిల్లా గణపవరం సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం శిథిలావస్థకు చేరింది. పైకప్పు పెచ్చులూడి, ఊచలు తేలి ప్రమాదకరంగా ఉంది. గదుల్లో గచ్చు కుంగిపోయింది. ఇక్కడ మూడు నుంచి తొమ్మిదో తరగతి వరకు 35 మంది ఉన్నారు. వారంతా శిథిల గదుల్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి.  పక్కనే చెరువు ఉండటంతో మరుగుదొడ్లు కుంగి శిథిలమయ్యాయి. మిగిలిన వాటికి తలుపులు సరిగా లేవు. సెప్టిక్‌ ట్యాంకుపై శ్లాబు పూర్తిగా కూలిపోవడంతో సిమెంట్‌ రేకులను అడ్డుగా ఉంచారు. ఆదమరిచి అడుగేస్తే విదార్థులు సెప్టిక్‌ ట్యాంకులో పడిపోయే ప్రమాదముంది. ఇటీవల ప్రహరీ సైతం కూలిపోయింది. విద్యార్థినులు కాలకృత్యాలు తీర్చుకోవాలన్నా, స్నానాలు చేయాలన్నా పక్కనున్న పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి. వసతిగృహంలోని సమస్యలను చూసి కొత్త విద్యార్థులు చేరేందుకు ఆసక్తి చూపడం లేదు.

ఈనాడు, ఏలూరు, గణపవరం, న్యూస్‌టుడే

పెచ్చులూడి ప్రమాదకరంగా ఉన్న పైకప్పు

అరకొర వసతుల నడుమ చదువుకుంటున్న విద్యార్థులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని