logo

రేపు 22 కేంద్రాల్లో పాలిసెట్‌

పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్‌)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్‌ తెలిపారు.

Published : 26 Apr 2024 03:49 IST

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్‌)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్‌ తెలిపారు. శనివారం ఉదయం 11 నుంచి ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు. తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, నరసాపురంలలో 22 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షకు 7,338 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులను గంట ముందు నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నిర్దేశిత సమయం తర్వాత నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు. హాల్‌టికెట్‌తో పాటు బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్‌, హెబ్‌బీ పెన్సిల్‌ లేదా 2హెచ్‌బీ పెన్సిల్‌, ఎరేజర్‌, షార్ప్‌నర్‌ తప్పనిసరిగా తెచ్చుకోవాలి. సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను అనుమతించరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని