Vatti Vasanth Kumar: మాజీ మంత్రి వట్టి వసంతకుమార్‌ కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి వట్టి వసంతకుమార్‌ (70) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. విశాఖపట్నంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Updated : 29 Jan 2023 08:21 IST

విశాఖపట్నం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ (70) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. విశాఖపట్నంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వసంతకుమార్‌ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పూళ్ల గ్రామం. ఉంగుటూరు నుంచి కాంగ్రెస్ తరఫున 2004, 2009 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డి కేబినెట్‌లలో వసంతకుమార్ మంత్రిగా పని చేశారు. గ్రామీణాభివృద్ధి, పర్యాటక శాఖల బాధ్యతలను ఆయన నిర్వర్తించారు. 2014 ఎన్నికల తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన భౌతికకాయాన్ని విశాఖపట్నం నుంచి స్వగ్రామానికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని