logo

కాలువల నిర్వహణకు స్వచ్ఛ భారత్‌ నిధులు

చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలను సమర్థంగా నిర్వహించడంతోపాటు గ్రామాల్లో మురుగునీటి కాలువల సమగ్ర నిర్వహణకు జనాభా ప్రాతిపదికన తల ఒక్కింటికి రూ.660 చొప్పున అందజేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత్‌ మిషన్‌ సంయుక్త కార్యదర్శి, డైరెక్టర్‌ జితేంద్ర శ్రీవాత్సవ తెలిపారు.

Published : 07 Jun 2023 04:17 IST

సంపద సృష్టి కేంద్రాన్ని పరిశీలిస్తున్న స్వచ్ఛ భారత్‌ మిషన్‌ సంయుక్త కార్యదర్శి జితేంద్రశ్రీవాత్సవ, కేంద్ర బృందం సభ్యులు, అధికారులు

భీమడోలు, న్యూస్‌టుడే: చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలను సమర్థంగా నిర్వహించడంతోపాటు గ్రామాల్లో మురుగునీటి కాలువల సమగ్ర నిర్వహణకు జనాభా ప్రాతిపదికన తల ఒక్కింటికి రూ.660 చొప్పున అందజేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత్‌ మిషన్‌ సంయుక్త కార్యదర్శి, డైరెక్టర్‌ జితేంద్ర శ్రీవాత్సవ తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కార్యక్రమాల పరిశీలనలో భాగంగా క్షేత్ర సందర్శన కోసం కేంద్ర అధికారుల బృందం భీమడోలు, దుద్దేపూడి గ్రామాల్లో మంగళవారం పర్యటించింది. తొలుత భీమడోలు పంచాయతీ కార్యాలయానికి వచ్చిన అధికారులు సర్పంచి సునీత, అధికారులతో సమావేశమయ్యారు. గ్రామంలో పారిశుద్ధ్య పరిరక్షణ చర్యలు, గృహ నిర్మాణాలు.. దానికి అనుబంధంగా మరుగుదొడ్ల నిర్మాణం, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రం నిర్వహణ తదితర అంశాల గురించి  జితేంద్ర శ్రీవాత్సవ అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంతమార్కెట్‌ కూడలి సమీపంలోని చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాన్ని సందర్శించిన అధికారులకు చైతన్య యువజన సంఘం అధ్యక్షుడు పి.మాన్‌సింగ్‌ తడి, పొడి చెత్తలను వేరు చేసే విధానం, సేంద్రియ ఎరువు తయారీని వివరించారు. రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.వెంకటమురళి మాట్లాడుతూ కొల్లేరు సరస్సులోకి గ్రామాల నుంచి మురుగునీరు వెళ్లకుండా ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నూజివీడు సబ్‌ కలెక్టర్‌ ఆదర్ష్‌ రాజీంద్రన్‌, జడ్పీ సీఈవో రవికుమార్‌, డీపీవో ఎ.వి.విజయలక్ష్మి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఈడీ ఊర్మిళాదేవి, జడ్పీటీసీ సభ్యురాలు భవానిరంగ, ఎంపీపీ రామయ్య, ఎంపీడీవో పద్మావతిదేవి, తహసీల్దారు ఇందిరాగాంధీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని