logo

సీఎం ‘స్పందన’లో స్పందనే లేదు

ముఖ్యమంత్రి రెండు, మూడు నెలలకు ఒకసారి స్పందనపై సమీక్షిస్తున్నా స్పందన లేదని మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి విమర్శించారు. సంక్రాంతి కనుమ సందర్భంగా ఆదివారం డీఎల్‌ దంపతులు స్థానిక మాధవరాయస్వామి ఆలయం చేరుకోగా ఆలయ పాలకవర్గం,

Published : 17 Jan 2022 04:30 IST

 

మాజీ మంత్రి డీఎల్‌


ఆలయ ఛైర్మన్‌ భూమిరెడ్డి సుబ్బరాయుడుకు విరాళం
అందజేస్తున్న మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి దంపతులు

మైదుకూరు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి రెండు, మూడు నెలలకు ఒకసారి స్పందనపై సమీక్షిస్తున్నా స్పందన లేదని మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి విమర్శించారు. సంక్రాంతి కనుమ సందర్భంగా ఆదివారం డీఎల్‌ దంపతులు స్థానిక మాధవరాయస్వామి ఆలయం చేరుకోగా ఆలయ పాలకవర్గం, పునరుద్ధరణ కమిటీ ప్రతినిధులు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చాపాడు మండలం విశ్వనాథపురంలో యానిమేటర్‌ పొదుపు సంఘాల మొత్తాలను స్వాహా చేసిన అంశంపై ఎస్పీకి ఏడాది కిందట ఫిర్యాదు చేసినా స్పందన లేదని, తాను జోక్యం చేసుకోవడంతో కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. ఎస్పీ వద్ద స్పందనలో ఫిర్యాదు చేస్తే ఆయన డీఎస్పీకి రాస్తారని, డీఎస్పీ ఇరువర్గాలను కూర్చోబెట్టుకుని పంచాయతీ చేసి అతని ఆదాయం అతను చూసుకుంటున్నారని ఆరోపించారు. మైదుకూరు మాధవరాయస్వామి ఆలయానికి ఆస్తులున్నా ఆదాయం లేదన్నారు. ఆలయ నిర్వహణకు నిధుల్లేవంటే బాధాకరమన్నారు. ఆలయ అర్చకులకు తక్కువ వేతనం ఇచ్చి కడుపు మాడ్చడం దురదృష్టకరమన్నారు. బ్రాహ్మణులను సరిగా చూడకపోతే ప్రభుత్వాల మనుగడ కష్టమన్నారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ రవీంద్రారెడ్డి ఉంటాడని, అన్యాయాన్ని సహించేది లేదన్నారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణ, కొందరు శాసనసభ్యుల ధనదాహం ఘోరంగా ఉందని ఈపరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే నాలుగైదు నెలల్లో ఈ పరిస్థితిని చక్కదిద్దాలనే ఆలోచన ఉందన్నారు. ఈ సందర్భంగా మాధవ రాయస్వామి ఆలయ ప్రహరీకి మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి దంపతులు ఆలయ కమిటీ ఛైర్మన్‌ భూమిరెడ్డి సుబ్బరాయుడుకు రూ.లక్ష విరాళం అందజేశారు. కార్యక్రమంలో తెదేపా నాయకుడు ధనపాల జగన్‌, స్థానిక ప్రతినిధులు ఎలిశెట్టి ప్రసాద్‌, గురవయ్య, వెంకటరత్నం, బద్వేలు సుబ్బరాయుడు, బద్వేలు లక్షుమయ్య, సంజీవరాయుడు, చొక్కం ఆంజనేయుడు, చొక్కం రమేష్‌, వసంతరామిరెడ్డి, దాసారెడ్డి ఓబయ్య పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని