logo

Bheemla nayak: పవన్‌ కల్యాణ్‌ అభిమానుల రాస్తారోకో

భీమ్లా నాయక్‌ సినిమా విడుదల సందర్భంగా అదనపు ప్రదర్శనలు వేయొద్దని, టికెట్ల ధరలు తగ్గించాలంటూ థియేటర్లకు ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తోందంటూ సినీ హీరో పవన్‌ కల్యాణ్‌ అభిమానులు, జనసేన కార్యకర్తలు గురువారం రాత్రి కొత్తవలసలో

Updated : 25 Feb 2022 07:51 IST

నినాదాలు చేస్తున్న యువకులు

కొత్తవలస, న్యూస్‌టుడే: భీమ్లా నాయక్‌ సినిమా విడుదల సందర్భంగా అదనపు ప్రదర్శనలు వేయొద్దని, టికెట్ల ధరలు తగ్గించాలంటూ థియేటర్లకు ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తోందంటూ సినీ హీరో పవన్‌ కల్యాణ్‌ అభిమానులు, జనసేన కార్యకర్తలు గురువారం రాత్రి కొత్తవలసలో రాస్తారోకో చేపట్టారు. కొత్తవలస-విజయనగరం మార్గంలో ఉన్న రెండు సినిమా థియేటర్ల కూడలి వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. సినిమా విడుదలను ఆపాలని సీఎం జగన్‌ చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాకపోకలు నిలిచిపోవడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. నాయకులు గొరపల్లి రవి, జి.అప్పారావును అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఆందోళనకారులంతా స్టేషన్‌కు తరలివెళ్లారు. రాస్తారోకో సరైన చర్యకాదని ఎస్సై వీరజనార్దన్‌ వారికి చెప్పి బైండోవర్‌చేసి పంపించారు. అయితే నిబంధనల నేపథ్యంలో సినిమాను ప్రదర్శించలేమని పలువురు థియేటర్ల యజమానులు బాహాటంగానే చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని