icon icon icon
icon icon icon

చేర్యాల.. మూడు దిక్కుల్లో..

1962 కంటే ముందు జనగామతో కలిసి ‘సమితి’ కేంద్రంగా వెలుగొందింది. సమితి వ్యవస్థ రద్దయిన తర్వాత నియోజకవర్గ కేంద్రంగానూ 47 ఏళ్ల పాటు కొనసాగింది.

Updated : 14 Nov 2023 11:30 IST

చేర్యాల.. 1962 కంటే ముందు జనగామతో కలిసి ‘సమితి’ కేంద్రంగా వెలుగొందింది. సమితి వ్యవస్థ రద్దయిన తర్వాత నియోజకవర్గ కేంద్రంగానూ 47 ఏళ్ల పాటు కొనసాగింది. అంతేకాకుండా పదేళ పాటు టౌన్‌ మున్సిపాలిటీగానూ సాగింది. ఆ తర్వాత నిబంధనల మేర మేజర్‌ పంచాయతీగా మారిపోయింది. దీనికి తోడు 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జనగామ నియోజకవర్గంలో విలీనమైంది. ఇక అక్కడి నుంచి మండల కేంద్రంగానే మిగిలిపోయింది. తిరిగి స్వరాష్ట్రం వచ్చాక మున్సిపాలిటీ హోదాను దక్కించుకుంది. కాగా ఈ ప్రాంతం జిల్లా పరంగా సిద్దిపేటలో ఉండగా.. శాసనసభ నియోజకవర్గం జనగామ కిందకు వస్తుంది. అదే పార్లమెంటరీ నియోజకవర్గం భువనగిరి పరిధిలో ఉంటుంది. రెవెన్యూ డివిజన్‌ సిద్దిపేట కాగా, పోలీసు, విద్యుత్తుశాఖ డివిజన్‌ కార్యాలయం హుస్నాబాద్‌కు, ఇంజినీరింగ్‌ కార్యాలయం గజ్వేల్‌కు కేటాయించారు. ఇలా చేర్యాల మూడు దిక్కులకు కేటాయించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img