icon icon icon
icon icon icon

డబ్బు పంచేటోళ్లని తరిమేశారు..!

ఓటు హక్కును అమ్ముకోవద్దు అనేది అంతటా వినిపిస్తున్న నినాదం. ఐనా ఓట్లు కొనేందుకు పల్లెలకు వస్తూనే ఉన్నారు.. ఓటర్లకు ఎర వేస్తూనే ఉన్నారు.

Updated : 14 Nov 2023 11:39 IST

టు హక్కును అమ్ముకోవద్దు అనేది అంతటా వినిపిస్తున్న నినాదం. ఐనా ఓట్లు కొనేందుకు పల్లెలకు వస్తూనే ఉన్నారు.. ఓటర్లకు ఎర వేస్తూనే ఉన్నారు. ఈ సంస్కృతికి తెరపడటం లేదు. కానీ 1999 సార్వత్రిక ఎన్నికలప్పుడు దీనికి భిన్నంగా మేళ్లచెరువులో ఒక ఘటన చోటుచేసుకుంది. ఓ అభ్యర్థికి సంబంధించిన వారు సాయంత్రం వేళ ఓటర్లకు డబ్బులు పంచేందుకు మేళ్లచెరువు వచ్చారు. విషయం పసిగట్టిన స్థానికులు కొందరు వారున్న ప్రదేశాలకు కర్రలతో వెళ్లారు. వారిని చూసి డబ్బు పంచేందుకు వచ్చినవారికి అర్థమైంది. ఇక అంతే.. నిమిషాల్లోనే వారి వాహనాలను వదిలేసి పొలాల్లోకి పరుగులు తీశారు. ఆగ్రహంతో ఉన్న స్థానికులు అక్కడే వదిలేసిన జీపును తిరగల పడేశారు. అప్పుడు ఇక్కడ డబ్బుల పంపిణీకి బ్రేకు పడింది. నియోజకవర్గమంతా ఈ ఘటనే చర్చనీయాంశమైంది. ఇప్పుడు అంతటా పరిస్థితులు మారిపోయాయి. నేడు ప్రత్యర్థి పార్టీల వారు ఇచ్చే డబ్బుల్ని తీసుకుని ఓటు తమకే వేయాలని పెద్ద పెద్ద నేతలే ఓటర్లకు చెబుతుండటం గమనార్హం.

మేళ్లచెరువు, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img