icon icon icon
icon icon icon

1978లో అత్యధికం..2009లో అత్యల్పం

ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమైందే. ఒక్కోసారి ఒక్క ఓటే గెలుపోటములను నిర్ణయిస్తుంది.

Updated : 16 Nov 2023 12:35 IST

బోధన్‌ ఎన్నికల్లో అభ్యర్థుల ఆధిక్యాలు

న్యూస్‌టుడే - బోధన్‌ పట్టణం: ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమైందే. ఒక్కోసారి ఒక్క ఓటే గెలుపోటములను నిర్ణయిస్తుంది. అందుకే నియోజకవర్గంలోని ఓటర్లందరూ తననే ఆదరించాలని పోటీ చేసే అభ్యర్థులు ఆశిస్తారు. కానీ పోలైన అన్ని ఓట్లలో.. ఒకరికి కొంత ఎక్కువ పోలవుతాయి. ఆ ఓట్ల ఆధిక్యమే అతనిని విజేతగా నిలుపుతుంది. అలా బోధన్‌ నియోజకవర్గానికి జరిగిన పదిహేను శాసనసభ ఎన్నికల్లో రెండు ఫలితాలు ప్రత్యేకంగా నిలిచాయి. అందులో ఒకటి 1978లో అత్యధికంగా సాధించిన మెజారిటీ కాగా 2009లో అత్యల్ప ఆధిక్యం నమోదైంది.

వివరాలు ఇలా :

1978లో జరిగిన ఎన్నికల్లో మొత్తం ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. వారిలో ముగ్గురికి ధరావతు గల్లంతైంది. మిగిలిన ముగ్గురిలో మొదటి స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌ (ఐ) అభ్యర్థి గులాం సందాని 34,526 ఓట్లు సాధించారు. ద్వితీయ స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి నారాయణరెడ్డికి 11,440 ఓట్లు లభించాయి. గెలిచిన అభ్యర్థి ఓడిన వ్యక్తిపై 23,086 ఓట్లు ఎక్కువగా పొందారు. ఆధిక్యం శాతంలో చూస్తే 36.25 శాతంగా నమోదైంది. అంత ఆధిక్యం ఎప్పుడూ నమోదు కాలేదు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌లో చీలిక వచ్చి గులాం సందాని కాంగ్రెస్‌(ఐ) తరఫున పోటీ చేసినట్లు చెబుతారు. ఆయన కోసం ప్రచారానికి దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బోధన్‌కు వచ్చారు. అత్యల్ప మెజార్టీతో బయటపడిన ఎన్నికగా 2009 నిలిచింది. ఈ ఎన్నికల్లో మొత్తం ఏడుగురు బరిలో నిలిచారు. అందులో నలుగురు తమ ధరావతు కోల్పోయారు. వారిలో విజేతగా నిలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డికి 42,494 ఓట్లు పోలయ్యాయి. ద్వితీయ స్థానంలో నిలిచిన తెరాస అభ్యర్థి షకీల్‌ 41,219 ఓట్లు సాధించారు. ఆధిక్యం 1,275 ఓట్లు కాగా శాతంలో చూస్తే 0.97 శాతంగా నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img