icon icon icon
icon icon icon

మెదక్‌ నియోజకవర్గంలో అమ్మ.. నాన్న.. ఓ కుమారుడు!!

ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు జరుగుతుంటాయి. అలాంటి ఘటనే మెదక్‌ నియోజకవర్గంలో చోటుచేసుకుంది.

Updated : 18 Nov 2023 10:53 IST

ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు జరుగుతుంటాయి. అలాంటి ఘటనే మెదక్‌ నియోజకవర్గంలో చోటుచేసుకుంది. ఇక్కడ ప్రస్తుతం భారాస నుంచి పద్మా దేవేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి మైనంపల్లి రోహిత్‌రావు బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గం 2004లో రామాయంపేటగా ఉండేది. 2004 సాధారణ ఎన్నికల్లో తెదేపా నుంచి మైనంపల్లి వాణి (రోహిత్‌రావు తల్లి) పోటీ చేయగా... తెరాస, కాంగ్రెస్‌ల సంయుక్త అభ్యర్థిగా పద్మాదేవేందర్‌రెడ్డి నిలిచి విజయం సాధించారు. 2008 ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి పద్మా దేవేందర్‌రెడ్డిపై తెదేపా అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు(రోహిత్‌రావు తండ్రి) గెలిచారు. 2009 పునర్విభజనలో రామాయంపేటను మెదక్‌ నియోజకవర్గంలో కలిపేశారు. అప్పటి ఎన్నికల్లో తెదేపా-తెరాసల ఉమ్మడి అభ్యర్థిగా మైనంపల్లి హన్మంతరావుకు టికెట్‌ దక్కింది. దీంతో పద్మా దేవేందర్‌రెడ్డి స్వతంత్రంగా పోటీ చేయగా హన్మంతరావు విజయం సాధించారు. 2014లో తెరాసలో చేరిన హన్మంతరావు... మల్కాజిగిరి నుంచి పోటీ చేశారు. ఇక ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో మెదక్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా మైనంపల్లి రోహిత్‌రావు టికెట్‌ దక్కించుకున్నారు. ఆయన తల్లి వాణి కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసినా, తర్వాత ఉపసంహరించుకున్నారు. ఇలా... ఒకే వ్యక్తిపై వేర్వేరు ఎన్నికల్లో అమ్మ.. నాన్న.. కుమారుడు పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది.

 న్యూస్‌టుడే, రామాయంపేట, మెదక్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img