icon icon icon
icon icon icon

Telangana assembly elections: చరిత్రకు వేదిక గజ్వేల్‌

గజ్వేల్‌ పేరు వినగానే ఉద్యమం, సినిమా, రాజకీయాలు, మిషన్‌ భగీరథ ఇలా ఎన్నో ప్రత్యేకతలు గుర్తుకొస్తాయి. సీఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌ రాజకీయ చైతన్యంతో పాటు కవులు, కళాకారులు, చరిత్రకు వేదికగా నిలవడం విశేషం.

Updated : 21 Nov 2023 14:11 IST

గజ్వేల్‌లోని విద్యాలయం

గజ్వేల్‌ పేరు వినగానే ఉద్యమం, సినిమా, రాజకీయాలు, మిషన్‌ భగీరథ ఇలా ఎన్నో ప్రత్యేకతలు గుర్తుకొస్తాయి. సీఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌ రాజకీయ చైతన్యంతో పాటు కవులు, కళాకారులు, చరిత్రకు వేదికగా నిలవడం విశేషం.

  • తెలంగాణ తొలి విడత ఉద్యమం (1969)లో గజ్వేల్‌లో పోలీసుల కాల్పుల్లో ఐలా నర్సింలు నేలకొరిగి అమరుడయ్యారు.
  • పేద ప్రజల జీవితాలపై సినిమాలు తీసి జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్న సినీ దర్శకులు బి.నర్సింగరావు స్వగ్రామం గజ్వేల్‌ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌. మాభూమి, రంగుల కల, దేవదాసి, దసిటి వంటి సందేత్మక చిత్రాలను రూపకల్పన చేసి అవార్డులు అందుకున్నారు. చిత్రలేఖనంలోనూ తనదైన ముద్ర వేశారు.
  • 1962లో దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీ హవా కొనసాగుతున్నా గజ్వేల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిపై స్థానిక నినాదంతో స్వతంత్ర అభ్యర్థి సైదయ్యను నిలబెట్టి విజయబావుటా ఎగురవేశారు మాజీ ఎమ్మెల్సీ మాదాటి రంగారెడ్డి. ఆయనది గజ్వేల్‌ మండలం కొడకండ్ల. ఒకే అభ్యర్థిని నాలుగు పర్యాయాలు గెలిపించి సత్తా చాటారు.
  • భారాస ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ తాగునీటి పథకం తొలి ప్రాజెక్టు గజ్వేల్‌ మండలం కోమటిబండలో నిర్మించడం విశేషం. 2016 ఆగస్టు 7న ప్రధానమంత్రి నరేంద్రమోదీ దాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
  • కేజీ టు పీజీ విద్యావ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నమూనాగా గజ్వేల్‌లో రూ.148 కోట్లతో 40 ఎకరాల్లో బాలబాలికలకు వేర్వేరుగా విద్యాలయాలు నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు.

న్యూస్‌టుడే, గజ్వేల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img