కరోనా: ఆ చట్టం కింద మొదటి కేసు నమోదు!

నిబంధనలను గాలికి వదిలేసి, వైద్యుడి సలహాను పట్టించుకోని ఓ మహిళపై అధికారులు కేసు నమోదు చేశారు.

Published : 06 Oct 2020 20:31 IST


ముంబయి: నిబంధనలను గాలికి వదిలేసి, వైద్యుడి సలహాను పట్టించుకోని ఓ మహిళపై అధికారులు కేసు నమోదు చేశారు. ఆమె నిర్లక్ష్యం కరోనా సోకిన ఆమె భర్త ప్రాణాలు తీసిందంటూ అంటువ్యాధుల చట్టం కింద కేసు పెట్టారు. ఈ తరహాలో నమోదైన మొదటి కేసు ఇదే కావొచ్చని తెలుస్తుంది. వివరాల్లోకి వెళ్తే..

సెప్టెంబరు 28న మహారాష్ట్రలోని భండారా జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా, పాజిటివ్‌గా తేలింది. దాంతో అతడిని పరీక్షించిన వైద్యులు బాధితుడిని ఆసుపత్రిలో చేర్చాలని కుటుంబ సభ్యులకు సూచించారు. కానీ, అతడి భార్య ఆ సలహాను పట్టించుకోకుండా భర్తను ఇంటికి తీసుకెళ్లింది. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురై, అతడు మరణించాడు. 

కాగా, ఆ ప్రాంతానికి చెందిన మెడికల్ సూపరిండెంట్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి అంటువ్యాధుల చట్టం(1897)లోని సెక్షన్‌ 188(క్వారంటైన్‌ అవిధేయత) కింద ఆమెపై ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని పౌనీ సబ్‌డివిజినల్ అధికారి ధ్రువీకరించారు. మెడికల్ సూపరిండెంట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా,  వైరస్‌ సోకిన వ్యక్తి మరణానికి బంధువులను బాధ్యులను చేస్తూ నమోదు మొదటి కేసు ఇదేనని తెలుస్తుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని