
Updated : 21 Sep 2020 17:54 IST
అయోధ్యలో భూముల ధరలకు రెక్కలు
నెల రోజుల్లో పెరిగిన వైనం..
లఖ్‌నవూ (ఉత్తరప్రదేశ్): రామ జన్మభూమి అయోధ్యలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. నెల కిందటి వరకూ చదరపు గజం రూ.1000 నుంచి రూ.1500 ఉండగా ప్రస్తుతం రూ.3వేల వరకూ పలుకుతోంది. అయోధ్యలో రామమందిరం నిర్మించటానికి గత నెల ఆగస్టులో భూమి పూజ చేశారు. అప్పటి నుంచి అయోధ్యలో భూధరలు అమాంతం పెరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. అయోధ్యను ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని ఆ రాష్ర్ట సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. నగరంలో పెద్ద ఎత్తున వసతులు సమకూరుస్తామని చెప్పిన ఆయన మూడు నక్షత్రాల హోటళ్లతో పాటు ఎయిర్‌పోర్టును నిర్మిస్తామని ఇటీవల ప్రకటించారు.
Tags :