పాల సరఫరాకు ఆర్థిక వనరులు చేకూర్చండి

అరణ్య భవన్‌లో మంత్రులు హరీశ్‌రావు, తలసాని సమీక్ష నిర్వహించారు. పశుసంవర్థక, మత్స్య, ఆర్థిక రంగాల్లో పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ..

Updated : 12 Oct 2022 16:02 IST

మంత్రి హరీశ్‌ను కోరిన తలసాని

హైదరాబాద్‌: అరణ్య భవన్‌లో మంత్రులు హరీశ్‌రావు, తలసాని సమీక్ష నిర్వహించారు. పశుసంవర్థక, మత్స్య, ఆర్థిక రంగాల్లో పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం తలసాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో అంగన్‌వాడీల ద్వారా గర్బిణీలకు రోజూ పాలు సరఫరా చేస్తున్నామన్నారు. దూర ప్రాంతాలకు సరఫరా చేసే క్రమంలో పాలు పాడవుతున్నాయని తెలిపారు. విశాఖ డెయిరీ ద్వారా టెట్రాప్యాక్‌ పాల సరఫరాకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. దీనికోసం ఆర్థిక వనరులను సమకూర్చాలని మంత్రి హరీశ్‌రావును కోరారు. ఈ విషయాన్ని పరిశీలించాలని హరీశ్‌రావు ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. గోపాల మిత్ర వేతన బకాయిలు, పాల సేకరణ ప్రోత్సాహం విడుదల చేయాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని