వారిని అనుసరిస్తే 9/11 విధ్వంసం జరిగేది కాదు

సకల మానవాళి నేర్చుకోవడానికి ఎన్నో పాఠాలు కలిగిన గొప్ప వ్యక్తులు ఆచార్య వినోబాభావే,  స్వామి వివేకానంద అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

Published : 12 Sep 2020 01:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సకల మానవాళి నేర్చుకోవడానికి ఎన్నో పాఠాలు కలిగిన గొప్ప వ్యక్తులు ఆచార్య వినోబాభావే, స్వామి వివేకానంద అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వినోబాభావే జయంతి సహా వివేకానందుడు అమెరికాలోని చికాగోలో 1893వ సంవత్సరంలో ఇదే రోజు ప్రసంగించిన సందర్భాన్ని పురస్కరించుకొని వారి గురించి మోదీ ట్విటర్‌లో ట్వీట్‌ చేశారు.

2001లో ఇదే రోజు అమెరికాలోని డబ్ల్యూటీవో టవర్స్‌పై ఉగ్రదాడిని ప్రస్తావించిన మోదీ.. వినోబా భావే ‘జై జగత్‌’ నినాదం, వివేకానందుడు ప్రవచించిన విశ్వమానవ సౌభ్రాతృత్వం అనే మార్గంలో పయనిస్తే ఆనాటి విధ్వంసం జరిగి ఉండేది కాదని అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ కూడా వినోబాభావేను ఎంతో గొప్పగా ప్రశంసించారన్న ప్రధాని యువత వివేకానందుడి చికాగో ప్రసంగాన్ని చదవాలని సూచించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని