మన్‌ కీ బాత్‌.. ఆలోచనలకు ప్రధాని పిలుపు  

ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడే ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమం ఈ నెల 25న జరగనుంది. దీనికి సంబంధించి కార్యక్రమంలో మాట్లాడటానికి సరికొత్త ఆలోచనలు పంచుకోవాలని ప్రధాని శనివారం ట్విటర్‌....

Published : 10 Oct 2020 21:50 IST

దిల్లీ: ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడే ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమం ఈ నెల 25న జరగనుంది. దీనికి సంబంధించి కార్యక్రమంలో మాట్లాడటానికి సరికొత్త ఆలోచనలు పంచుకోవాలని ప్రధాని శనివారం ట్విటర్‌ వేదికగా పిలుపునిచ్చారు. రేడియో ప్రసారం ద్వారా నిర్వహించే ఈ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమం సమాజంలో మార్పులు తెచ్చే మంచి విషయాలు చర్చించడానికి వేదిక అవుతోంది. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న గొప్ప వ్యక్తులు జీవిత ప్రయాణాన్ని పంచుకోడానికి మంచి అవకాశంగా నిలుస్తోందని ప్రధాని అన్నారు.  

గత నెల జరిగిన ‘మన్‌ కీ బాత్‌’లో మోదీ రైతుల గొప్పతనం.. కొత్తగా తెచ్చిన వ్యవసాయ బిల్లులు.. వాటిని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో వివరించారు. దీంతో పాటు మన దేశంలో కథలు చెప్పడం వెనుకున్న ప్రాముఖ్యాన్ని తెలిపారు. కథలు చెప్పే ప్రక్రియ ఇండియాలో ఎప్పటి నుంచో ఉందన్నారు. వీటితో పాటు మన సైనికుల ధీరత్వం, 2016 నాటి సర్జికల్‌ స్ర్టైక్స్‌ గురించి ప్రధాని మోదీ మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని