బైపీసీ అభ్యర్థులకు 16 నుంచి కౌన్సెలింగ్‌

ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ బైపీసీ అభ్యర్థులకు ఈనెల 16 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రవేశాల కన్వీనర్

Published : 09 Dec 2020 22:37 IST

హైదరాబాద్‌: ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ బైపీసీ అభ్యర్థులకు ఈనెల 16 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలన కోసం ఈనెల 16న ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్‌ చేసుకోవాలని సూచించారు. గతంలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకాని అభ్యర్థులకు ఈనెల 17న ప్రత్యేక విడత పరిశీలన ఉంటుంన్నారు. ఈనెల 16 నుంచి 18 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని.. 21వ తేదీ నుంచి ప్రత్యేక విడత సీట్లను కేటాయించనున్నట్లు చెప్పారు. సీటు దక్కిన విద్యార్థులు ఈనెల 24లోగా కళాశాలల్లో రిపోర్టు చేయాలన్నారు. రాష్ట్రంలోని ప్రైవేటు ఫార్మసీ కళాశాలల్లో మిగిలిన సీట్ల కోసం ఈనెల 21న స్పాట్ ప్రవేశాలకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు నవీన్‌ మిత్తల్‌ వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లో.. 
వైద్య విద్య మొదటి కౌన్సెలింగ్‌కు ఎన్టీఆర్ హెల్త్‌ యూనివర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఆప్షన్లు ఇవ్వాలని సూచించారు. ఇందుకు గాను ఈనెల 10న ఉదయం 8 గంటల నుంచి 13వ తేదీ రాత్రి 8 గంటల వరకు ఆప్షన్లు ఇచ్చేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని