TS NEWS: దోస్త్‌ రిజిస్ట్రేషన్ల గడువు పెంపు

దోస్త్‌ మొదటి విడత రిజిస్ట్రేషన్లు, వెబ్‌ ఆప్షన్లకు గడువు ఈనెల 24 వరకు పొడిగిస్తున్నట్టు దోస్త్‌ కన్వీనర్‌ లింబాద్రి తెలిపారు. ఇవాళ్టి వరకు 1.40లక్షల మంది విద్యార్థులు

Updated : 15 Jul 2021 19:14 IST

హైదరాబాద్‌: దోస్త్‌ మొదటి విడత రిజిస్ట్రేషన్లు, వెబ్‌ ఆప్షన్లకు గడువు ఈనెల 24 వరకు పొడిగిస్తున్నట్టు దోస్త్‌ కన్వీనర్‌ లింబాద్రి తెలిపారు. ఇవాళ్టి వరకు 1.40లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్టు చెప్పారు.  ఈనెల 31న డిగ్రీ మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుందని వెల్లడించారు. ఆగస్టు 1 నుంచి 9వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు, ఆగస్టు 2 నుంచి 9 వరకు రెండో విడత వెబ్‌ ఆప్షన్లు ఉంటాయని పేర్కొ్నారు. ఆగస్టు 14న రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. ఆధార్‌తో అనుసంధానించిన మొబైల్‌తో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. మీ సేవా కేంద్రాల్లోనూ దోస్త్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చన్నారు. దోస్త్‌ యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదులను కూడా పరిష్కరిస్తున్నట్టు వెల్లడించారు.

ఎడ్‌సెట్‌ దరఖాస్తుల గడువు పెంపు

ఎడ్‌సెట్‌ దరఖాస్తుల గడువు మరోసారి పొడిగించినట్టు కన్వీనర్‌ తెలిపారు. ఈనెల 22 వరకు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. వ్యాయామ కోర్సుల ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువు ఈనెల 31 వరకు పొడిగిస్తున్నట్టు కన్వీనర్‌ సత్యనారాయణ తెలిపారు. నేటి వరకు పీఈసెట్‌కు 3,462 దరఖాస్తులు వచ్చినట్టు చెప్పారు. బీపెడ్‌కు 1988, డీపెడ్‌కు 1544 దరఖాస్తులు వచ్చాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని