కల్పవృక్ష వాహనంపై శ్రీవారు

ప్రకృతి శోభను సమకూర్చేది వృక్షం. సృష్టిలో ఎన్ని వృక్షాలున్నా అన్ని వృక్షాల్లో మేటి కల్పవృక్షం. ఇది మనోవాంచిత ఫలాలను అందిస్తుందని భక్తుల...

Updated : 19 Oct 2020 12:25 IST

తిరుమల: ప్రకృతి శోభను సమకూర్చేది వృక్షం. సృష్టిలో ఎన్ని వృక్షాలున్నా అన్ని వృక్షాల్లో మేటి కల్పవృక్షం. ఇది మనోవాంచిత ఫలాలను అందిస్తుందని భక్తుల విశ్వాసం. అలాంటి కల్పవృక్షాన్ని వాహనంగా చేసుకొని బ్రహ్మోత్సవాల నాలుగో రోజు ఉదయం వేంకటేశ్వరుడు దర్శనమిస్తున్నారు. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలిదప్పులు ఉండవట.పూర్వ జన్మ స్మరణ కలుగుతుందని పురాణాలు వినిపిస్తున్నాయి. కోరిన ఫలాలు ఇచ్చే కల్పవృక్షాన్ని భక్తులు చూడలేకపోయినా.. వారి మనోవాంఛలు గమనించి ఫలాలు ప్రసాదించే దేవదేవుడు ఏడుకొండలవాడు. చర్నాకోల్‌ చేతబట్టి రాజమన్నార్‌ రూపధారిగా ఉభయదేవేరులతో కలిసి స్వర్ణ కల్పవృక్షం కింద తిరుమల వెంకన్న కొలువై భక్తులకు దర్శనమిస్తున్నారు.దుష్టశిక్షణ, శిష్ట రక్షణ చేసి కోరిన ఫలాన్ని స్వామి అనుగ్రహిస్తారని కల్పవృక్ష వాహన సాక్షాత్కార పరమార్థం.

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని