AP High Court: అంగన్వాడీ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

రాష్ట్రంలో అంగన్వాడీ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. సుమారు 600 అంగన్వాడీ పోస్టుల భర్తీపై గతంలో ఇచ్చిన స్టేను ఎత్తివేసిన ఉన్నత న్యాయస్థానం.. నిబంధనల ప్రకారం నియామక ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Updated : 23 Nov 2022 15:33 IST

అమరావతి: రాష్ట్రంలో అంగన్వాడీ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. నిబంధనల ప్రకారం పోస్టులు భర్తీ చేయట్లేదంటూ..  నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ గతంలో కొంతమంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం పోస్టుల భర్తీపై స్టే విధించింది. తాజాగా ఆ స్టేను ఎత్తివేస్తూ నిబంధనల ప్రకారం పోస్టుల భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో రాష్ట్రంలో దాదాపు 600 అంగన్వాడీ సూపర్‌వైజర్‌ పోస్టులు భర్తీకానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని