TS News: ప్రవేశ పరీక్షలు నిర్వహించే వర్సిటీలు, కన్వీనర్ల నియామకం

తెలంగాణలో వివిధ ప్రవేశ పరీక్షలు నిర్వహించే వర్సిటీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఆయా సెట్‌లకు సంబంధించి కన్వీనర్లను కూడా నియమించింది.

Updated : 07 Jan 2022 18:56 IST


హైదరాబాద్‌: తెలంగాణలో వివిధ ప్రవేశ పరీక్షలు నిర్వహించే వర్సిటీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఆయా సెట్‌లకు సంబంధించి కన్వీనర్లను కూడా నియమించింది. జేఎన్‌టీయూహెచ్‌కు ఎంసెట్‌, ఈసెట్‌ నిర్వహణ బాధ్యత అప్పగించింది. ఎంసెట్‌ కన్వీనర్‌గా జేఎన్‌టీయూహెచ్‌ రెక్టార్‌ గోవర్థన్‌, ఈసెట్‌ కన్వీనర్‌గా జేఎన్‌టీయూహెచ్‌ ప్రొఫెసర్‌ కె.విజయ్‌ వ్యవహరించనున్నారు. ఓయూకు లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌, పీజీ ఈసెట్‌, ఎడ్‌సెట్‌ నిర్వహణ బాధ్యత అప్పగించారు. లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌ కన్వీనర్‌గా ప్రొఫెసర్‌ జీబీ రెడ్డిని నియమించారు. ఎడ్‌సెట్‌ కన్వీనర్‌గా ఓయూ ప్రొఫెసర్‌ ఏ.రామకృష్ణ, పీజీఈసెట్‌ కన్వీనర్‌గా ఓయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. ఐసెట్‌ నిర్వహణ బాధ్యతలు కాకతీయ యూనివర్సిటీకి, ఐసెట్‌ కన్వీనర్‌గా కేయూ ప్రొఫెసర్‌ కె.రాజిరెడ్డికి అప్పగించారు. ప్రవేశ పరీక్షల తేదీలు తర్వాత ప్రకటిస్తాని ఉన్నత విద్యామండలి తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని