Diabetes food chart: ఇవి తినండి...షుగర్‌ తగ్గించుకోండి

మధుమేహం వచ్చిందని తెలిసిన తర్వాత దాన్ని అదుపులో పెట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం

Published : 03 Jul 2022 01:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మధుమేహం(diabetes) వచ్చిందని తెలిసిన తర్వాత దాన్ని అదుపులో పెట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ఆహారంలో మార్పులు, వ్యాయామం చేయడానికి సిద్ధమై పోతాం. మందులు, శారీరక వ్యాయామమే కాదు..ఉదయపు అల్పాహారం(diabetes food)లో మార్పులు చేసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మధుమేహులు ఇలా చేసి చూడండి

* చక్కని అల్పాహారం తీసుకోవడంతో గ్లూకోజ్‌ శాతాన్ని చాలా వరకు అదుపులో పెట్టుకోవచ్చు. 

* ఉదయపు అల్పాహారంలో ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్లు, ముడిధాన్యాలు, కొవ్వులేని మాంసం, చేపలు, ఎండు పప్పులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

* ఏ పదార్థం తయారు చేసుకున్నా కూరగాయల ముక్కలు ఉండేలా చూసుకోవాలి. ఇడ్లీలో క్యారెట్‌ తురుము లేదా బీట్‌రూట్‌ తురుము వేసుకోవాలి.

* ఏదో ఒకరకం పప్పుతో కాకుండా రకరకాల పప్పులను కలిపి వండుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. 

* మినప గారెలకు బదులు రకరకాల పప్పులు కలిపి వడలుగా చేసుకోవాలి. క్యారెట్‌, పాలకూర వేస్తే మరీ బాగుంటుంది.

* చపాతీ పుల్కా వంటివి చేసుకుంటే గోధుమ పిండితో కాకుండా మల్టీగ్రెయిన్‌ గోధుమపిండిని వినియోగించాలి. 

* పూరీలకు బదులు చపాతీలు, దానిలో మెంతికూర వేసుకుని తింటే మంచిది. 

* తెల్ల బ్రెడ్‌ కాకుండా బ్రౌన్‌ బ్రెడ్‌ను గుడ్డుతో కలిపి తీసుకోవాలి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని