LRS: ఎల్‌ఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌ మాట తప్పింది: హరీశ్‌రావు

ప్రభుత్వం లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌)కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంపై భారాస నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు. 

Updated : 27 Feb 2024 15:27 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం(LRS)ను ఉచితంగా అమలు చేయాలని, లేదంటే మోసపూరిత హామీ ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో హరీష్ రావు ఎక్స్(ట్విటర్‌) వేదికగా స్పందించారు. 

‘‘హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారింది. అధికారంలోకి రాగానే, ఎల్ఆర్ఎస్‌ను రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పి.. ఫీజు వసూలు చేసేందుకు సిద్ధమైంది. నో ఎల్‌ఆర్‌ఎస్‌ - నో బీఆర్‌ఎస్‌ అంటూ గతంలో ప్రజలను రెచ్చగొట్టి.. ఇప్పుడు ఫీజు వసూలు చేస్తామనడం కాంగ్రెస్ నేతల మోసపూరిత మాటలకు నిదర్శనం. కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, గతంలో మేం చేసిన ప్రకటనలకు అనుగుణంగా ఎల్‌ఆర్‌ఎస్‌ను ఎలాంటి ఫీజులు లేకుండా అమలు చేయాలి’’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు