Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 09 May 2024 09:14 IST

1. భగ్గుమంటున్న మగ్గం

రాట్నాలు.. రగిలిపోతున్నాయి.. కండెలు.. మండిపడుతున్నాయి.. పట్టుచీరలు.. వెక్కిరిస్తున్నాయి.. అల్లికలు.. అబద్ధాల కోరువంటున్నాయి.. వర్ణాలు.. రంగులు మార్చే ఊసరెల్లివి అంటున్నాయి.. మగ్గం.. మడమ తిప్పావంటోంది.. ఓట్లు దండుకొని... అధికారంలోకి వచ్చాక.. పథకాలను అందని ద్రాక్షల్ని చేసినందుకు... మీకు నీతి లేదని చే‘నేత’లు... చీదరించుకుంటున్నారు జగన్‌! పూర్తి కథనం

2. ఐదు నెలల్లో పరిస్థితులు తారుమారు

అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్‌ నేతలు అరచేతిలో వైకుంఠం చూపారని.. ప్రజలందర్నీ మోసపుచ్చి, అధికారం చేపట్టాక ఏ ఒక్క వాగ్దానమూ అమలు చేయలేదని భారాస అధినేత కేసీఆర్‌ ధ్వజమెత్తారు. ‘కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చింది. ఒక్క ఉచిత బస్‌ ప్రయాణం తప్ప ఏదీ నెరవేర్చలేదు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన అయిదు నెలల్లోనే పరిస్థితులు తారుమారయ్యాయి’ అని కేసీఆర్‌ విమర్శించారు.పూర్తి కథనం

3. ధీమా లేదు.. బీమా రాదు!

జగన్‌ గద్దెనెక్కింది మొదలు కౌలు రైతుకు అన్నీ కష్టాలే. రాయితీ  పథకాలు లేవు. పెట్టుబడి సాయం అందలేదు. తెదేపా హయాంలో (2019 వరకు) భూమి యజమాని పట్టా పుస్తకం నకలు చూపించి వేలిముద్ర వేస్తే కౌలు రైతుకు రాయితీ విత్తనాలిచ్చేవారు. వైకాపా వచ్చాక అది తీసేశారు. పూర్తి కథనం

4. ఆడపిల్లని చేరదీసి.. అంగడిబొమ్మగా చేసి 

ఎవరూ లేని ఓ చిన్నారిని చేరదీసిన మహిళ.. ఆమెను పెంచి, పోషించి చివరికి వ్యభిచార కూపంలోకి దింపింది. యూసుఫ్‌గూడలో పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఓ ఇంటిపై దాడి చేయగా.. విషయం వెలుగులోకి వచ్చింది. శ్రీకృష్ణనగర్‌లోని ఓ ఇంట్లో వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు పశ్చిమ మండల టాస్క్‌పోర్స్‌ పోలీసులు దాడి చేశారు.పూర్తి కథనం

5. పులకేశీ.. విపక్షాలపై ఎంత కసి?

వైకాపా సర్కారు కొలువుదీరింది మొదలు విపక్ష నేతలే లక్ష్యంగా కక్షసాధింపు చర్యలకు దిగింది. ప్రభుత్వ విధానాల్లో లోపాలు ఎత్తిచూపినా.. అధికార పార్టీ నేతల అక్రమాలపై గొంతెత్తినా.. సర్కారు అవినీతిపై ప్రశ్నించినా.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా కేసులు, అరెస్టులతో వేధింపులకు గురిచేశారు. సామాన్యుల నుంచి ఉద్యోగులు, విపక్ష నేతల వరకు అంతా ఈ అయిదేళ్లలో జగన్‌ నిరంకుశత్వ బాధితులే.పూర్తి కథనం

6. కేసీఆర్‌కు ఎంత పెద్ద శిక్ష వేసినా తప్పు లేదు!

‘అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ పార్టీ ఓడిపోతే ఎవరైనా బాధపడ్డారా? మద్యం కేసులో కవిత అరెస్ట్‌ అయితే అయ్యో పాపం అని ఎవరైనా అన్నారా? నేను వెయ్యి ఊళ్లలో అడిగినా.. వారి గురించి ఎవరూ బాధపడలేదు’ అని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు ఎంత పెద్ద శిక్ష వేసినా తప్పు లేదని, ఆయన ఆడినన్ని అబద్ధాలు ప్రపంచంలో ఎవరూ ఆడలేదని వ్యాఖ్యానించారు. పూర్తి కథనం

7. పేదల పుట్టల్లో వైకా‘పాములు’

చిత్తూరు  సమీపంలో ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలను గతంలో వైకాపాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి తన అనుచరులకు బినామీల పేరుతో ఒక్కొక్కరికీ రెండు, మూడు స్థలాలు మంజూరు చేయించారు. వాటితోపాటు ఆ పక్కనున్న స్థలాలను ఆక్రమించారు. కొందరికి పట్టాలు ఇచ్చినా స్థలాలు చూపలేదు.పూర్తి కథనం

8. రాహుల్‌ ఇటలీకి పోవాల్సిందే.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈ ఎన్నికల్లో రాయ్‌బరేలీలో ఓడిపోవడం ఖాయం. స్థిరపడడానికి ఆ తర్వాత ఇటలీ వెళ్లాల్సిందే. ఆయనకు మిగిలింది అదొక్కటే’’ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పారు. అమేఠీ నుంచి మొదట వయనాడ్‌కు, ఇప్పుడు రాయ్‌బరేలీకి వెళ్లిన ఆయనకు పరాజయం తప్పదన్నారు. బుధవారం యూపీలోని లఖింపుర్‌ ఖేరీ, హర్దోయీ, కన్నౌజ్‌లలో ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు.పూర్తి కథనం

9. ఎవడ్ని ఎక్కడ పెట్టాలో తెలుసు

సుమారు రెండు నెలల క్రితం దర్శి మండలం తూర్పు వీరాయపాలెం గ్రామానికి చెందిన రవి అనే నాయకుడితో ఆమె మాట్లాడిన ఆడియో కాల్‌  ఎన్నికల వేళ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు విడులైన ఈ ఆడియో ఇప్పుడు దర్శి రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.పూర్తి కథనం

10. యువత మెచ్చేలా కొత్త పథకాలు

కెనరా బ్యాంకు కాసా (కరెంటు, సేవింగ్స్‌ ఖాతాల) డిపాజిట్లు పెంచుకునేందుకు విభిన్న పథకాలను ఆవిష్కరిస్తోంది. ఇందువల్ల డిపాజిట్ల వ్యయం తగ్గి, బ్యాంకు స్థిర వృద్ధికి తోడ్పడుతుందని అంచనా వేస్తోంది. ఖాతాదార్లకు మరింత చేరువయ్యేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 250కి పైగా కొత్త శాఖలు ప్రారంభిస్తామని కెనరా బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ కె.సత్యనారాయణ రాజు ‘ఈనాడు’కు వెల్లడించారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని