Boath MLA: బోథ్‌ ఎమ్మెల్యే బాపూరావు రాథోడ్‌పై చీటింగ్‌ కేసు

బోథ్‌ ఎమ్మెల్యే బాపూరావు రాథోడ్‌ (Rathod Bapu Rao)పై చీటింగ్‌ కేసు నమోదైంది.

Published : 18 Oct 2023 13:40 IST

ఆదిలాబాద్‌: బోథ్‌ ఎమ్మెల్యే బాపూరావు రాథోడ్‌ (Rathod Bapu Rao)పై చీటింగ్‌ కేసు నమోదైంది. జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ఆదేశాలతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2012లో విక్రయించిన 2 ఇళ్ల స్థలాలను రెండోసారి అమ్మారని.. ఆదిలాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కోర్టుకు వెళ్లారు. తనను బాపూరావు మోసం చేశారని తెలిపారు. దీంతో కోర్టు ఆదేశాలతో.. బాపూరావు, సుదర్శన్‌పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని