
TS News: తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావుకు కరోనా
హైదరాబాద్: తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు (డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్) డాక్టర్ శ్రీనివాసరావు కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలతో ఆసుపత్రిలో చేరుతున్నట్టు వెల్లడించారు. ‘‘స్వల్ప కొవిడ్ లక్షణాలు కనిపించాయి. పరీక్ష ద్వారా కొవిడ్ నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్తగా ఐసోలేషన్, తగిన చికిత్స కోసం ఆసుపత్రిలో చేరుతున్నాను. ఏ విధమైన ఆందోళనలు, అపోహలు వద్దు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తా. అందరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా’’ అని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణలో గత కొన్ని రోజులుగా కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్న విషయం తెలిసిందే.
ఇటీవల కొవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పలువురు వైద్యులు, ఆరోగ్య సిబ్బంది మహమ్మారి బారినపడుతున్నారు. గాంధీ ఆసుపత్రిలో దాదాపు 80 మందికి కొవిడ్ సోకినట్టు నిర్ధారణ కాగా.. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ పేర్కొన్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో దాదాపు 180 మంది వరకు వైద్యులు, సిబ్బంది కొవిడ్ బారిన పడినట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్ వెల్లడించారు. నీలోఫర్ ఆసుపత్రిలోనూ 25 మందికి కొవిడ్ సోకినట్టు ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి. పెరుగుతున్న కరోనా కేసులకు తోడు వైద్య సిబ్బందిపై మహమ్మారి పంజా విసురుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.