AP News: వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాల్సిందే: సీఎస్‌

ఎన్నికలతో ముడిపడిన ఎలాంటి ప్రక్రియలోనూ గ్రామ, వార్డు వాలంటీర్లు పాల్గొనకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Updated : 14 Mar 2024 19:43 IST

అమరావతి: ఎన్నికలతో ముడిపడిన ఎలాంటి ప్రక్రియలోనూ గ్రామ, వార్డు వాలంటీర్లు పాల్గొనకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానున్న దృష్ట్యా వాలంటీర్లను అన్నిరకాల ఎన్నికల విధుల నుంచి తక్షణమే తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వారు ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి ప్రక్రియలో పాల్గొన్నా ఈసీ మార్గదర్శకాల ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేశారు. పోలింగ్‌ ఏజెంట్లుగా ఉండేందుకు కూడా అర్హులు కారని పేర్కొంటూ స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని