NTR Jayanthi: వంద నాణెంపై ఎన్టీఆర్‌ బొమ్మ: పురందేశ్వరి

రూ.వంద నాణెంపై ఎన్టీఆర్‌ బొమ్మ ముద్రణ గురించి తాము ఆర్బీఐతో మాట్లాడుతున్నామని దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు...

Updated : 28 May 2022 10:24 IST

హైదరాబాద్‌: రూ.వంద నాణెంపై ఎన్టీఆర్‌ బొమ్మ ముద్రణ గురించి తాము ఆర్బీఐతో మాట్లాడుతున్నామని దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా శనివారం ఉదయాన్నే హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు నందమూరి, దగ్గుబాటి కుటుంబసభ్యులు చేరుకున్నారు. పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్‌ కుమార్తె పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు. శత జయంతి ఉత్సవాల నిర్వహణపై స్పందించారు.

‘‘నందమూరి తారక రామారావు ఒక సంచలనం. నేటి నుంచి వచ్చే ఏడాది మే 28 వరకూ ఈ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తాం. ఉత్సవాల నిర్వహణలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 12 కేంద్రాలను గుర్తించాం. ఆయా కేంద్రాల్లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల నిర్వహణ పర్యవేక్షించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశాం. బాలకృష్ణ, రాఘవేంద్రరావు వంటి ప్రముఖులు ఆ కమిటీలో ఉన్నారు. అన్ని రంగాల్లో నిష్ణాతులైన వారిని ఘనంగా సత్కరించనున్నాం’’ అని పురందేశ్వరి తెలిపారు.

ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకల్లో భాగంగా పోర్ట్‌ ల్యాండ్‌ తెదేపా ఎన్‌ఆర్‌ఐ సాయం అందించారు.  కుట్టుమిషన్లు, వీల్‌ ఛైర్లు, దుప్పట్లు సమకూర్చారు. ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించిన అనంతరం పురందేశ్వరి లబ్ధిదారులకు వాటిని అందజేశారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని