Published : 17 Apr 2022 04:02 IST

ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (17-04-2022)

  - డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

ప్రశాంతమైన జీవనం ఏర్పడుతుంది. ధన,ధాన్య లాభాలు ఉంటాయి. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. మాట విలువను కాపాడుకోవాలి. ఇష్టదైవారాధన మంచిది.

శుభం చేకూరుతుంది. మీ మీ రంగాల్లో విజయసిద్ధి ఉంది. బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆనందోత్సాహాలతో కాలం గడుస్తుంది. చంద్రశ్లోకం చదవండి.

ముఖ్యమైన వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతాయి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. దుర్గాస్తుతి చేస్తే మేలు.

ఒక వ్యవహారంలో తోటివారి సహకారం అందుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు కొన్ని అమలు చేయగలుగుతారు. మనశ్శాంతి లోపించకుండా చూసుకోవాలి. దుర్గా శ్లోకం చదవండి.

కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ  అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. బంధువులతో మాటపట్టింపులకు పోవద్దు. శనిశ్లోకం చదవాలి.

శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. పైఅధికారులతో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాల్సి ఉంటుంది. సూర్య నమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది.

ఒక వ్యవహారంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో విబేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇష్టదైవ దర్శనం మేలు చేస్తుంది.

ప్రారంభించబోయే పనుల్లో పట్టుదల వదలకండి. ఉద్యోగంలో ఉన్నత అధికారులతో నమ్రతగా వ్యవహరించాలి. గిట్టనివారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. దైవధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు.

కొన్ని సంఘటనలు మనోబలాన్ని తగ్గించే విధంగా ఉంటాయి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవమిస్తే మంచిది. కోపానికి గురికాకండి. నవగ్రహ శ్లోకాలను చదివితే మంచి జరుగుతుంది.

 

శుభకాలం నడుస్తోంది. సమయాన్ని మంచి పనులకు ఉపయోగించండి. అభివృద్ధిని సాధించే దిశగా ఆలోచనలు చేస్తారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.

ధర్మసిద్ధి ఉంది. స్వస్థాన ప్రాప్తి ఉంది. ప్రారంభించిన పనులను పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఇష్టదైవారాధన మేలుచేస్తుంది.

ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకోవడం మేలు. ఈశ్వర దర్శనం శుభప్రదం.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని