Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/03/23)

Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఉంటుంది.  డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.

Published : 05 Mar 2023 06:08 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. గొప్ప ఫలితాలను అందుకుంటారు. ప్రతిభతో విజయాలను అందుకుంటారు. విష్ణు నామస్మరణ మేలు చేస్తుంది.

శుభకాలం నడుస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. నూతన పద్ధతులను అవలంభించి లక్ష్యాన్ని సులువుగా చేరతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధు,మిత్రుల ఆదరణ ఉంటుంది. ఇష్టదైవ సందర్శనం మేలు చేస్తుంది.

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ప్రారంభించిన పనులను పూర్తిచేయడానికి చిత్తశుద్ధి చాలా అవసరం.అనవసర విషయాలతో కాలాన్ని వృథా చేయకండి. సాహసోపేతమైన విజయాలు ఉన్నాయి. శివ ఆరాధన శుభప్రదం. 

అనుకూలమైన గ్రహబలం ఉంది. ఏ పని తలపెట్టినా సకాలంలో పూర్తవుతుంది. సమాజంలో గొప్ప పేరు సంపాదిస్తారు. ఆస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.   బంధు,మిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవ సందర్శనం మేలు చేస్తుంది.

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అధికారుల వల్ల మీకు కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి.  ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే ఇంకా బాగుంటుంది.

లక్ష్యాన్ని చేరే క్రమంలో మనోబలం సర్వప్రధానం. కీలక వ్యవహారాలలో తోటివారి ఆలోచనల వల్ల మంచి జరుగుతుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. కొందరి ప్రవర్తన మీ మనసును చికాకు పరుస్తుంది. అకారణ కలహసూచన ఉంది కాబట్టి వాదనలకు దూరంగా ఉండటమే మంచిది. శ్రీలక్ష్మీదేవి దర్శనం శుభకరం. 

శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువుల సహకారంతో మేలు జరుగుతుంది.మీ మీ రంగాల్లో మేలు చేకూరుతుంది. సప్తమ చంద్రబలం అనుకూలిస్తోంది. ఇష్టదైవారాధన మంచిది.  

మీ మీ రంగాల్లో విజయం సాధిస్తారు. సంపూర్ణ కార్యసిద్ధి ఉంది. సంపూర్ణ మనోబలం కలిగి ఉంటారు. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.

 

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. అనుకూల ఫలితాలు ఉన్నాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

మీ మీ రంగాల్లో విశేషమైన ఫలితాలను సాధిస్తారు. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యా్న్ని పెంచుతుంది. మీ మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. శ్రీఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.

మిశ్రమ కాలం. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దత్తాత్రేయుని ఆరాధించడం మంచిది.

- ఇంటర్నెట్‌ డెస్క్


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు