Penukonda: ఎమ్మెల్యే శంకర నారాయణ కారుపై డిటోనేటర్‌తో దాడి

పెనుకొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర నారాయణ కారుపై డిటోనేటర్‌ దాడి జరిగింది! సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని గడ్డం తండా పంచాయతీ పరిధిలో ఆదివారం ఈ ఘటన జరిగింది.

Updated : 08 Oct 2023 20:16 IST

గోరంట్ల: పెనుకొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర నారాయణ కారుపై డిటోనేటర్‌ దాడి జరిగింది! సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని గడ్డం తండా పంచాయతీ పరిధిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే శంకర నారాయణ ఆధ్వర్యంలో సుమారు 12 గంటలకు గ్రామంలో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ప్రారంభించారు. ఆయన వాహనం దిగి కొంత దూరం నడిచారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వాహనంపై ఓ ఆకతాయి డిటోనేటర్‌ విసరడం కలకలం రేపింది. అయితే, డిటోనేటర్‌ గురితప్పి పొదల్లో పడటం, అది పేలకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అక్కడున్న నాయకులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని