Dubai: వామ్మో..! కారు నంబరు ప్లేట్‌ అక్షరాల రూ.70 కోట్లు...

ఈ మధ్య కాలంలో వాహనాల నంబరు ప్లేట్లపై ఆసక్తి పెరుగుతోంది. కొందరికి ఫ్యాన్సీ నంబర్లపై మక్కువ ఎక్కువ.

Published : 26 Apr 2022 01:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ మధ్య కాలంలో వాహనాల నంబరు ప్లేట్లపై ఆసక్తి పెరుగుతోంది. కొందరికి ఫ్యాన్సీ నంబర్లపై మక్కువ ఎక్కువ. అందుకోసం ఎంత  ఖర్చు చేసేందుకైనా వెనకాడట్లేదు. అందులోనూ సింగిల్‌ డిజిట్‌ నంబర్‌ అయితే ఇక చెప్పేపని లేదు. సినీ ప్రముఖులు, బడా వ్యాపారవేత్తలు, రాజకీయనాయకులు తమకు నచ్చిన నంబర్‌ ప్లేట్ల కోసం ఎక్కువగా వేలంలో పాల్గొంటారు. ఇటీవల చండీగఢ్‌లో ఓ వ్యక్తి తన రూ.71వేల స్కూటీ కోసం రూ.15 లక్షలు పెట్టి  మరీ ఫ్యాన్సీ నంబర్‌ను సొంతం చేసుకున్నాడు. ఇది సోషల్‌ మీడియాలో ఎంతగానో వైరలైంది. ఇప్పుడు తాజాగా దుబాయ్‌కి చెందిన ఓ వ్యక్తి తన కారు కోసం ఏకంగా  35 మిలియన్ల దిర్హమ్‌లు (రూ.70 కోట్లుకు పైగానే) ఖర్చుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఓ ఛారీటీ సంస్థ నిర్వహించిన వేలంలో పాల్గొన్న అతడు ‘AA8’ అనే సింగిల్‌ డిజిట్‌ నంబర్‌ కోసం అంత మొత్తం ఖర్చు చేశాడు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్‌లలో మూడో స్థానంలో నిలిచింది. గత ఏడాది ఇదే ఛారిటీ సంస్థ నిర్వహించిన వేలంలో ‘AA9’ అనే నెంబర్‌ ప్లేట్‌ రూ.79 కోట్లకు పలికి రికార్డు సృష్టించింది. 50 దేశాల్లోని పేద ప్రజల ఆకలి తీర్చేందుకు ‘1 బిలియన్‌ మీల్స్‌’ ప్రచారానికి మద్దతుగా ‘మోస్ట్‌ నోబల్‌ నంబర్స్‌’ అనే ఛారిటీ సంస్థ ఈ వేలంలో రూ.110 కోట్లను సమీకరించింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు