Andhra News: ఈఏపీసెట్‌-2022కు ఏర్పాట్లు పూర్తి... ఏపీ, తెలంగాణలో పరీక్షాకేంద్రాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశాలకోసం నిర్వహించే ఏపీఈఏపీసెట్‌-2022 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి

Published : 02 Jul 2022 22:49 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశాలకోసం నిర్వహించే ఏపీఈఏపీసెట్‌-2022 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు స్పష్టం చేశారు. జులై 4 నుంచి 12 వరకు ఈఏపీసెట్ పరీక్షలు జరుగుతాయని అన్నారు. 4వ తేదీ నుంచి 8 వరకు ఇంజినీరింగ్ పరీక్ష , 11 నుంచి 12 వరకు అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్ష జరుగుతుందని తెలిపారు. 122 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని, ఏపీలో 120 సెంటర్లు, తెలంగాణలో రెండు సెంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పరీక్షలు రాసేందుకు 3 లక్షల 84 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. పరీక్షా కేంద్రాలకు సంబంధించిన రూట్ మ్యాప్‌ని హాల్ టికెట్‌తో పాటు ఇస్తున్నట్లు ఆయన వివరించారు.

నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి పంపరాదనే నిబంధన కచ్చితంగా అమలవుతుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తప్పకుండా కుల ధ్రువీకరణ పత్రాలు తెచ్చుకోవాలని సూచించారు. ఎలక్ట్రానిక్‌ వస్తువులు తెచ్చినా, ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ బస్సులు, మెడికల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కోరామని తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని సూచించారు. ఏమైనా సందేహాలు ఉంటే 08554-234311, 232248 హెల్ప్‌లైన్‌ నంబర్లకు ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవచ్చునని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని