ఏనుగుల గుంపు బీభత్సం

చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో ఏనుగులు స్థానికులకు కంటిమీదకునుకు లేకుండా చేస్తున్నాయి. వెంకటేపల్లి, కుమ్మరమడుగు, దానమయ్యగారిపల్లె, పచ్చారుమేకలపల్లెలో పంట పొలాలను ఏనుగులు ధ్వంసం చేశాయి....

Published : 12 Jul 2021 08:24 IST

వి.కోట: చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో ఏనుగులు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వెంకటేపల్లి, కుమ్మరమడుగు, దానమయ్యగారిపల్లె, పచ్చారు మేకలపల్లెలో పంట పొలాలను ఏనుగులు ధ్వంసం చేశాయి. గుంపుగా వచ్చిన ఏనుగులు రాత్రంతా పంటపొలాలపై పడి నాశనం చేశాయి. కోళ్లఫారాలను కూలదోశాయి. కోతకు వచ్చిన అరటి, బీన్స్ పంటలను ఏనుగులు నాశనం చేశాయని రైతులు వాపోతున్నారు. గుంపు నుంచి వేరుపడిన ఓ ఏనుగు ఉదయం పొలాల్లోనే ఉండటంతో దాన్ని తరిమేందుకు రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. బాణసంచా కాల్చుతూ, డప్పులు వాయిస్తూ ఏనుగును అడవిలోకి తరిమేందుకు ప్రయత్నించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని