Fever Survey: 720 బృందాలతో 53,002 ఇళ్లలో.. 

కొవిడ్ నియంత్రణకు గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫీవర్ సర్వేలో భాగంగా ఇప్పటివరకు 1,82,924 ఇళ్లలో సర్వే నిర్వహించారు. సోమవారం ...

Published : 08 May 2021 01:10 IST

హైదరాబాద్: కొవిడ్ నియంత్రణకు గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫీవర్ సర్వేలో భాగంగా ఇప్పటివరకు 1,82,924 ఇళ్లలో సర్వే నిర్వహించారు. సోమవారం ప్రారంభమైన ఈ సర్వేలో ప్రతి రోజు జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన బృందాలు ఇంటింటికీ తిరిగి జ్వరం, కొవిడ్ లక్షణాలున్నవారి సర్వేను పెద్దఎత్తున చేపట్టాయి. ఒక ఏఎన్ఎం, ఆశా వర్కర్, జీహెచ్ఎంసీ వర్కర్‌తో కూడిన బృందాలు ఇంటింటికీ తిరిగి సర్వే చేపట్టారు. ఈ బృందాలు జ్వరంతో ఉన్న వారి వివరాలను సేకరించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. నగరంలో ఇవాళ ఒక్కరోజే 720 బృందాలతో 53,002 ఇళ్లలో సర్వేను నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని