NRI TDP: ఎన్‌ఆర్‌ఐ తెదేపా కార్యకర్త యశస్వికి 41ఏ నోటీసు

తెదేపా ఎన్‌ఆర్‌ఐ కార్యకర్త బొద్దులూరి యశస్వి (యష్‌)ని ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated : 23 Dec 2023 16:55 IST

హైదరాబాద్‌: తెదేపా ఎన్‌ఆర్‌ఐ కార్యకర్త బొద్దులూరి యశస్వి (యష్‌)ని ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని పరామర్శించేందుకు వచ్చిన ఆయన్ని శంషాబాద్‌ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకొని గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించారు. నాలుగు గంటల తర్వాత 41ఏ నోటీసు ఇచ్చి యశస్విని విడిచిపెట్టారు. వైకాపా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకుగానూ ఆయనపై కేసు నమోదు చేశారు. వృత్తి రీత్యా యశస్వి అమెరికాలో ఉంటున్నారు. పోలీసుల చర్యను ఎన్నారై తెదేపా నేత జయరాం కోమటి తీవ్రంగా ఖండించారు. చివరి వంద రోజుల్లోనైనా ప్రజాస్వామిక పాలన అందిస్తాడేమో అని భావించిన ప్రవాసాంధ్రుల ఆశలను వమ్ము చేస్తూ.. జగన్‌ ప్రభుత్వం తన వక్ర బుద్ధిని కొనసాగిస్తోందని జయరామ్‌ విమర్శించారు. యష్‌ను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని అమెరికాలోని ఎన్నారైలు ముక్త కంఠంతో ఖండిస్తున్నారని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని