CJI: అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ వల్ల హైదరాబాద్‌కు మరింత పేరు: సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ

అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ సెంటర్‌ (ఐఏఎంసీ) శాశ్వత భవన నిర్మాణానికి సుప్రీం కోర్టు ప్రధాన

Updated : 12 Mar 2022 13:11 IST

హైదరాబాద్‌: అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ సెంటర్‌ (ఐఏఎంసీ) శాశ్వత భవన నిర్మాణానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఐఏఎంసీ ట్రస్ట్‌ రూపకర్త జస్టిస్‌ ఎన్‌.వి.రమణ భూమిపూజ చేశారు. హైదరాబాద్‌ హైటెక్స్‌లోని ఐకియా వెనుక ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్‌ సభ్యులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ హిమాకోహ్లి, మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్వీ రవీంద్రన్‌, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మహమూద్‌ అలీ, కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొననున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ మాట్లాడారు. ‘‘ఇప్పటికే హైదరాబాద్‌ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ కొనసాగుతోంది. గచ్చిబౌలిలో విలువైన భూమి కేటాయించినందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ వల్ల హైదరాబాద్‌కు మరింత పేరొస్తుంది. సింగపూర్‌లా హైదరాబాద్‌ కేంద్రం కూడా ప్రపంచ ఖ్యాతి పొందాలి. వచ్చే ఏడాది ఈ సమయానికి నిర్మాణం పూర్తి కావాలని ఆశిస్తున్నా’’ అని సీజేఐ అన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని