Andhra news: కోనసీమలో అదుపులోకి రాని మంటలు.. పైప్‌లైన్‌ కారణం కాదన్న ఓఎన్జీసీ

కోనసీమ జిల్లాలో ఇవాళ ఉదయం బోరుబావి నుంచి ఎగసిపడుతున్న గ్యాస్‌, మంటలు అదుపులోకి రావడం లేదు. అయితే, దీనికి ఓఎన్జీసీ పైప్‌లైన్‌ కారణం కాదని ఆ సంస్థ సిబ్బంది తేల్చారు.

Published : 15 Jul 2023 14:43 IST

రాజోలు: కోనసీమ జిల్లాలోని శివకోటి ఆక్వా చెరువు వద్ద బోరుబావి నుంచి గ్యాస్‌, అగ్నికీలలు ఎగసిపడటానికి గ్యాస్‌ పైప్‌లైన్‌ కారణం కాదని, అక్కడ అసలు పైప్‌లైనే లేదని ఓఎన్జీసీ సిబ్బంది తేల్చారు. భూమి పొరల్లో గ్యాస్‌, నీరు ద్వారానే మంటలొచ్చాని చెప్పారు. బోరును మరింత లోతుకు తవ్వడం వల్లే అగ్నికీలలు ఎగసిపడ్డాయని పేర్కొన్నారు. నరసాపురం నుంచి ప్రత్యేక బృందం వస్తోందని, వారు వచ్చాకే మంటల్ని అదుపు చేయడం సాధ్యపడుతుందని అన్నారు. అయితే, బోరుబావి సమీపంలోనే ఓఎన్జీసీ పైపులైన్‌ ఉందని స్థానికులు చెబుతున్నారు. ఘటనాస్థలిని రెవెన్యూ, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పరిశీలిస్తున్నారు. 

ఇవాళ ఉదయం రాజోలు మండలం శివకోటిలోని ఓ ఆక్వా చెరువు వద్ద బోరులోంచి గ్యాస్‌, అగ్నికీలలు ఎగసిపడటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అగ్నికీలలు, గ్యాస్‌ ఎగసిపడుతుండటంతో.. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 20 అడుగుల మేర ఈ మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ రంగంలోకి దిగింది. మంటలార్పేందుకు అగ్నిమాపక, ఓఎన్జీసీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటి వరకు మంటలు అదుపులోకి రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని