అణచివేస్తే ఉద్యమం మరింత ఉద్ధృతం

రేపటి నుంచి పోలీస్‌స్టేషన్లకు వెళ్లి పూలు, పండ్లు ఇచ్చి తమ శాంతియుత పోరాటానికి సహకరించాలని కోరతామని అమరావతి పరిరక్షణ సమితి నేతలు అన్నారు. సెక్షన్‌ 144 పేరిట ఉద్యమాన్ని

Published : 11 Jan 2020 11:31 IST

అమరావతి పరిరక్షణ సమితి నేతల హెచ్చరిక


 

విజయవాడ: రేపటి నుంచి పోలీస్‌స్టేషన్లకు వెళ్లి పూలు, పండ్లు ఇచ్చి తమ శాంతియుత పోరాటానికి సహకరించాలని కోరతామని అమరావతి పరిరక్షణ సమితి నేతలు అన్నారు. సెక్షన్‌ 144 పేరిట ఉద్యమాన్ని అణగదొక్కేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఐకాస నేతలు ఆరోపించారు. అణచివేయాలని చూస్తే ఉద్యమం మరింత ఉద్ధృతం అవుతుందని హెచ్చరించారు. పోలీసులను అడ్డంపెట్టుకుని తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని, మహిళలను కులంపేర్లు అడిగి కించపరుస్తున్నారని మండిపడ్డారు. మూడు రాజధానుల ఆలోచన విరమించుకునే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని నేతలు తేల్చిచెప్పారు. విజయవాడలో మీడియాతో మాట్లాడారు.

అమరావతి కోసం పార్టీలకు అతీతంగా ప్రజలు పోరాటం చేస్తుంటే సెక్షన్ 144 ద్వారా అణగదొక్కాలని ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఐకాస నేత శివారెడ్డి అన్నారు. ఇది పోలీసులు రాజ్యమా.. ప్రజా రాజ్యమా
 పోలీసులు ఆలోచించాలన్నారు. వైకాపా నేతలు ఏ ర్యాలీ చేసినా ఎటువంటి అనుమతీ అక్కర్లేదని, తాము ఇంటి ముందు క్యాండిల్ ర్యాలీ చేసినా ఫైర్ పర్మిషన్ పేరు చెప్పి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తాము నిబంధనల ప్రకారం అనుమతి అడిగినా ఇవ్వడం‌ లేదని, వైకాపా కార్యకర్తల కంటే ఘోరంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఐకాస నేత గద్దె తిరుపతి రావు విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని